AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Jayanti: హనుమాన్ జయంతి రోజున పూజా ఫలం దక్కాలంటే ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదంటే?

హనుమాన్ జయంతి రోజున పూజ చేయడమే కాదు.. కొన్ని ప్రత్యేక చర్యలు ఉన్నాయని, వాటిని చేయడం ద్వారా జీవితంలో సమస్యలు తొలగిపోయి సంతోషం, అదృష్టం లభిస్తాయని నమ్మకం. మరోవైపు హనుమంతుడి పూజ సమయంలో చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఈ చర్యలు శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలను ఇస్తాయని, కష్టాలు పెరుగుతాయని నమ్ముతారు

Hanuman Jayanti: హనుమాన్ జయంతి రోజున పూజా ఫలం దక్కాలంటే ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదంటే?
Hanuman Jayanti 2023
Surya Kala
|

Updated on: Apr 06, 2023 | 9:52 AM

Share

సంక్షోభాలను తొలగించి, బలాన్ని, తెలివిని ప్రసాదిస్తాడని వాయుపుత్రుడు హనుమంతుడిని పూజించడం ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. చైత్ర మాసం పౌర్ణమి రోజున వచ్చే హనుమాన్ జన్మదినోత్సవాన్ని నేడు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. వాస్తవానికి ఈ రోజున హనుమంతుడి పుట్టిన రోజుగా జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. శ్రద్ధా భక్తులతో సాంప్రదాయ ఆచారాలతో ఆయనను పూజించి..  ఉపవాసం ఉన్నవారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

హనుమాన్ జయంతి రోజున పూజ చేయడమే కాదు.. కొన్ని ప్రత్యేక చర్యలు ఉన్నాయని, వాటిని చేయడం ద్వారా జీవితంలో సమస్యలు తొలగిపోయి సంతోషం, అదృష్టం లభిస్తాయని నమ్మకం. మరోవైపు హనుమంతుడి పూజ సమయంలో చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఈ చర్యలు శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలను ఇస్తాయని, కష్టాలు పెరుగుతాయని నమ్ముతారు. హనుమాన్ జయంతి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.

హనుమాన్ జయంతి రోజు ఏమి చేయాలి సనాతన ధర్మం మత విశ్వాసాల ప్రకారం ఎరుపు రంగు హనుమంతుడికి చాలా ప్రియమైనది. అటువంటి పరిస్థితిలో పూజ సమయంలో వీలైనంత ఎక్కువగా ఎరుపు రంగును ఉపయోగించండి. పూజ సమయంలో వారికి ఎరుపు రంగు పూలు, సింధూరం, శనగలు సమర్పించండి.

ఇవి కూడా చదవండి

ఈ రోజున హనుమంతుడి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి. పూజలు చేయండి. పూజ సమయంలో హనుమంతుడి దగ్గర నూనె లేదా నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీకు సంతోషం, అదృష్టం లభిస్తుంది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి పూజలో తులసిని ఉపయోగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పూజ సమయంలో సమర్పించే నైవేద్యంలో కొన్ని తులసి ఆకులను తప్పకుండా సమర్పించండి. అంతేకాదు హనుమంతుడి తులసి ఆకులతో చేసిన దండను కూడా సమర్పించవచ్చు.

మీ కోరికలు నెరవేరడానికి, అడ్డంకులు తొలగిపోవడానికి ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించండి. ఇది కాకుండా, సుందర కాండ,  హనుమాన్ అష్టకం,  పారాయణం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

హనుమాన్ జయంతి రోజున ఏమి చేయకూడదంటే హనుమాన్ పూజ సమయంలో చరణామృతాన్ని సమర్పించకూడదు. అంతేకాదు పూజ సమయంలో హనుమంతుడికి చరణామృతంతో స్నానం చేయించకూడదని గుర్తుంచుకోండి. మత విశ్వాసాల ప్రకారం పూజలో దీనిని ఉపయోగించడం నిషేధించబడింది.

ఈ రోజున మాంసం-మద్యం వంటి వాటికీ దూరంగా ఉండండి. ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉపవాసం ఉండకపోయినా.. ఈ రోజున మీరు తామసిక ఆహారాన్ని తినకూడదు.

హనుమాన్ పూజలో పంచామృతం, చరణామృతం ఉపయోగించరాదు. హనుమాన్ పూజలో ఈ ఆచారం నిషేధించబడింది.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)