Horoscope Today: ఆ రాశివారికి ఆర్థిక సమస్య పరిష్కారం.. 12 రాశుల వారికి రాశిఫలాలు ఇలా..
తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి గురువారం (06 ఏప్రిల్ 2023) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Horoscope Today(06 ఏప్రిల్ 2023): తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి గురువారం (06 ఏప్రిల్ 2023) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తోంది. అదనపు ఆదాయ మార్గాల కోసం ఆలోచిస్తారు. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబపరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. తోబుట్టువులతో మాట పట్టింపులకు అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు.
- వృషభం (కృత్తిక ౨,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. విద్యార్థులు చదువుల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కలిగిస్తాయి.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఉద్యోగంలో సహచరులు మీ గురించి తప్పుడు ప్రచారం సాగించే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ బాధ్యతలను ఇతరులకు అప్ప చెప్పవద్దు. స్నేహితులు, బంధువులు అండగా నిలబడతారు. బంధువుల సహాయంతో పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. ప్రేమ ప్రయత్నంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. విదేశాల నుంచి ఉద్యోగ సంబంధంగా తీపి కబురు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. వృత్తి నిపుణులు ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక అంశాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండవు.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): అవసరాలకు తగిన డబ్బు అందుతుంది. కొందరు స్నేహితులు మీకు అన్ని విషయాలలోనూ అండగా నిలబడతారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నం ప్రారంభించడానికి సమయం అనుకూలంగా లేదు. బంధువుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మీ నుంచి సహాయం పొందిన వారు మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతారు. ఉద్యోగ జీవితం కొద్దిగా అసంతృప్తి కలిగిస్తుంది. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగవు.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ప్రయత్నాలు ప్రయోజనం కలిగిస్తాయి. బంధుమిత్రుల సలహాలు తీసుకోండి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు వెళతారు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తోంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ఐటీ రంగానికి చెందిన వారికి సమయం అనుకూలంగా ఉంది. వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి వ్యాపారాలు వారు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు.. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా వేధింపులు ఉంటాయి. ఒక వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ప్రయోజనం కలిగించవు.
- వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ట): ఆదాయం బాగానే ఉంటుంది. ఉద్యోగపరంగా జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. తల్లిదండ్రుల సహకారం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా మారుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మీరు గతంలో తీసుకొన్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. సహచరులందరూ మీకు వీలైనంతగా సహాయం చేస్తారు. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. వృత్తి వ్యాపారాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఐటీ వారికి మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అదనపు ఆర్థిక ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సానుకూల స్పందన లభిస్తుంది. ఐటి రంగంలో వారికి మంచి కంపెనీ నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
- కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు బాగా పెరిగిపోతాయి. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా వెనుకబడిపోతుంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో క్షణం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు స్నేహితులను నమ్మి డబ్బు నష్టపోతారు. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. కొత్త ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఐటీ రంగంలోని వారికి ఉద్యోగ అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్న వారికి లాభాలు నిలకడగా ఉంటాయి. డాక్టర్లు, లాయర్లకు చేతినిండా పని, జేబు నిండా డబ్బు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు అనిపిస్తుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమవ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. కోర్టు కేసు సానుకూలం అవుతుంది.
ఇవి కూడా చదవండి
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..