Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle Astrology: విలాస వస్తువులు కొనుగోలు చేయనున్న ఆ రాశివారు.. వారి జీవనశైలిలో సమూల మార్పులు..

గత జనవరి 18న శని, ఏప్రిల్ 23న గురువు, అక్టోబర్ 24న రాహు కేతువులు రాశులు మారటం వల్ల కొందరి జీవితాలలో వేషధారణ,  భాషల దగ్గర నుంచి జీవన శైలిలో మార్పులు మొదలవుతాయి.

Lifestyle Astrology: విలాస వస్తువులు కొనుగోలు చేయనున్న ఆ రాశివారు.. వారి జీవనశైలిలో సమూల మార్పులు..
Telugu AstrologyImage Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 05, 2023 | 6:04 PM

సాధారణంగా గురు,శని గ్రహాలు రాశులు మారడమంటే వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయనే భావించాలి. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాలలో ఉద్యోగపరంగా ఆదాయపరంగా వచ్చే మార్పులతో పాటు జీవనశైలిలో కూడా సమూలంగా మార్పులు రావడం జరుగుతుంది. గత జనవరి 18న శని, ఏప్రిల్ 23న గురువు, అక్టోబర్ 24న రాహు కేతువులు రాశులు మారటం వల్ల కొందరి జీవితాలలో వేషధారణ,  భాషల దగ్గర నుంచి జీవన శైలిలో మార్పులు మొదలవుతాయి. ముఖ్యంగా మేషం, వృషభం, తుల, వృశ్చికం, ధను రాశుల వారు ఎక్కువగా తమ జీవనశైలిని మార్చుకొనే అవకాశం ఉంటుంది. మిగిలిన రాశుల వారు తమకు ఎంతగా సంపద వచ్చి పడినా, ఎంతగా అధికారం సంక్రమించినా సాధారణంగా తమ తీరుతెన్నులను మార్చుకోవడానికి ఇష్టపడరు. ఇక పైన పేర్కొన్న రాశుల వారు ఏ విధంగా తమ జీవన శైలిని మార్చుకోబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.
  1. మేష రాశి: సాధారణంగా ఈ రాశి వారు ఆడంబరంగా, విలాసంగా బతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి జీవన విధానంలో అడుగడుగునా డాబు, దర్పం కనిపిస్తూ ఉంటాయి. తగ్గి ఉండటం అనేది వీరికి నచ్చని విషయం. ఏ విషయంలోనూ ఎక్కడా బయటపడరు. స్నేహితులతో కలిసి లేదా స్నేహితురాళ్ళతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొనడం, అవసరానికి తగ్గట్టుగా దుస్తులు మార్చడం, ఆధునిక వస్తువులను సమకూర్చు కోవడం వీరికి అలవాటుగా ఉంటుంది. మొత్తానికి వీరు ఆడంబర జీవులనే చెప్పాలి. ఈ సంవత్సరం ప్రధాన గ్రహాల మార్పుల వల్ల, వీరి జీవనశైలి మరింతగా మారిపోయే అవకాశం ఉంది. ఇతరులకు ట్రెండ్ సెట్టర్సుగా మారటం జరగవచ్చు. ఈ ఏడాది వీరు విలాసాల మీద మరింతగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. ఆధునిక జీవనశైలికి మారుపేరుగా మారే అవకాశం బాగా కనిపిస్తోంది.
  2. వృషభ రాశి: ఈ రాశి వారు సాధారణంగా ఆధునిక దుస్తులు వేసుకోవడంలో, సరికొత్త వస్తు సామగ్రిని సమకూర్చుకోవడంలో ముందుంటారు. ఇవి కాక వీరు సరికొత్త వంటకాలను రుచి చూడడంలో కూడా అందరికంటే ముందుంటారు. వీరు ఎక్కువగా భోజన ప్రియులు. ఆధునిక వంటకాలను రుచి చూడటంలో ప్రయోగాలు చేస్తుంటారు. అంతేకాదు, అతివేగంగా దుస్తులను మార్చడంతో పాటు భాషను కూడా మార్చేయ డంలో వీరు ప్రథమ స్థానంలో ఉంటారు. ప్రధాన గ్రహాల మార్పు వల్ల వీరు మరింతగా సంపద సమకూర్చుకునే అవకాశం ఉన్నందువల్ల ఈ రకమైన జీవనశైలి కొత్త పుంతలు తొక్కే అవ కాశం ఉంది. వీరికి భోజన ప్రియత్వంతోపాటు పరిమళాలను వాడే అలవాటు కూడా అందరి కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎంత ఖరీదు అయినప్పటికీ దేశ విదేశాల నుంచి సెంటు సీసా లను తెప్పించుకొని వాడటం వీరికి అలవాటు. మొత్తానికి ఈ జీవన విధానం ఈ ఏడాది అనేక మలుపులు తిరిగే అవకాశం ఉంది.
  3. తులా రాశి: ఈ రాశి వారు ఆధునిక జీవనంతో సమానంగా తమ జీవన శైలిని మార్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారికి కొత్త అంటే ఇష్టం. పాత అంటే పరమ రోత. ఆధునిక జీవనశైలిని అతి తేలికగా అలవర్చుకుంటారు. ఈ రాశి వారు ఎక్కువగా బ్రాండ్ దుస్తుల షాపుల్లోనూ, పెద్ద పెద్ద మాల్స్ లోను ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సాధారణ సినిమా హాల్స్ కు వెళ్ళటం, మామూలు బార్స్ కు లేదా హోటల్స్ కు వెళ్లటం వంటివి ఈ రాశి వారికి సరిపడని విషయాలు. వ్యక్తిగత సుఖాల మీద ఆనందాల మీద ఎంత ఖర్చు చేయడానికి అయినా వీరు వెనుకాడరు. ఈ ఏడాది ఉద్యోగ వృత్తి వ్యాపారాలపరంగా, ఆర్థిక లావాదేవీల పరంగా వీరు విపరీతంగా సంపాదించడానికి అవకాశం ఉన్నందువల్ల వీరి జీవనశైలి మరింత వినూత్నంగా మారబోతోందని చెప్పవచ్చు.
  4. వృశ్చిక రాశి: సాధారణంగా ఈ రాశి వారు భోగలాలసులు. జీవితాన్ని సుఖమయం, ఆనందమయం చేసుకోవడానికి వీరు ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తారు. దుస్తులు, వాచీలు, సెంట్లు, భోజనాలు తప్పనిసరిగా ఆధునికంగా ఉండాల్సిందేనని మీరు భావిస్తుంటారు. వీరి సామాజిక స్థాయి ఎటువంటిది అయినప్పటికీ, వీరి వేష భాషలు మాత్రం ఆధునికంగానే కనిపిస్తాయి. విలాసాల మీద విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. స్నేహితులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొనటానికి వీరు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో మాత్రమే స్నేహం చేస్తారు. వారికి తగ్గట్టుగా తమ జీవనశైలిని మార్చుకుంటారు. సాధారణంగా ఈ రాశి వారిలో మద్యపాన ప్రియత్వం కూడా ఒక మోతాదు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. వీరి అలవాట్లకు, జీవన విధానానికి తగ్గట్టుగా ఈ ఏడాది వీరికి ఆర్థిక స్థిరత్వం ఉద్యోగ స్థిరత్వం వంటివి అనుభవానికి వస్తున్నందు వల్ల వీరి జీవనశైలి మరింతగా ఆధునికం అయ్యే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఎక్కువగా ఆధునిక విలాస వస్తువుల మీద మోజు పెంచుకుంటారు. సరికొత్త సెల్ ఫోన్లు వాచీలు సెంట్లు దుస్తులు వగైరాల మీద ఎంత ఖర్చు చేయడానికి అయినా వీరు వెనుకాడరు. వీరు ఉద్యోగం లేదా వృత్తి లేదా వ్యాపారంలో ఉన్నప్పటికీ వీరి జీవన విధానం మాత్రం అపర కుబేరుల్ని తలపిస్తుంది. చివరికి వ్యవసాయ రంగంలో ఉన్నా వీరి జీవనశైలి వాణిజ్యవేత్తలను, పారిశ్రామికవేత్తలను మించి ఉంటుంది. వీరు ఆధునిక దుస్తులకు ఆధునిక పాదరక్షలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఒంటి మీద బట్టలు నలగనివ్వరు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. కారు లేనిదే బయటికి కదలరు. చిన్న వయసు నుంచే వాహనాలు, భవనాలు, వస్తు సామగ్రి మీద దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. అంతేకాదు వీటి కోసం చిన్నప్పటి నుంచే సంపాదన మార్గాలను కూడా చేపడతారు. ఈ ఏడాది గురు, శనులతో పాటు వీరికి కుజ, శుక్రులు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఆకాశమే హద్దుగా వీరు విలాసవంతమైన జీవితం గడపటానికి, ఆధునిక జీవనశైలిని వంట పట్టించుకోవడానికి బాగా అవకాశం ఉంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..