Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రాశివారు మీ జీవిత భాగస్వామి అయితే ఇది తప్పక తెలుసుకోండి.. ఇక సాఫీగా సంసార జీవితం..

దాంపత్య జీవితంలో ఏ రాశుల వారు ఏ విధంగా వ్యవహరిస్తారు, వారి ఇష్టాలు, అయిష్టాలు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకుంటే చాలావరకు ప్రయోజనం ఉంటుంది. జాతక చక్రంలోని 12 రాశుల వారికి రకరకాల రుచులు, అభిరుచులు ఉంటాయి.

ఆ రాశివారు మీ జీవిత భాగస్వామి అయితే ఇది తప్పక తెలుసుకోండి.. ఇక సాఫీగా సంసార జీవితం..
Telugu AstrologyImage Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 05, 2023 | 5:45 PM

సంసార జీవితం సుఖంగా, సంతోషంగా ముందుకు సాగాలంటే జీవిత భాగస్వాములు ఒకరితో ఒకరు ఎలా మెలగాలో తెలుసుకోవలసి ఉంటుంది. దాంపత్య జీవితంలో ఏ రాశుల వారు ఏ విధంగా వ్యవహరిస్తారు, వారి ఇష్టాలు, అయిష్టాలు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకుంటే చాలావరకు ప్రయోజనం ఉంటుంది. జాతక చక్రంలోని 12 రాశుల వారికి రకరకాల రుచులు, అభిరుచులు ఉంటాయి. వీటికి తగ్గట్టుగా జీవిత భాగస్వామి కొద్దిగా నైనా నడుచుకుంటే దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏ రాశుల వారు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది ఇక్కడ తెలుసుకుందాం.
  1. మేషం, సింహం, ధనుస్సు: ఈ మూడు రాశుల వారికి కామన్ గా ఒక లక్షణం కనిపిస్తూ ఉంటుంది. మగవారైనా, ఆడవారైనా ఈ రాశుల వారిలో ఆధిపత్య ధోరణి కాస్తంత ఎక్కువగా వ్యక్తం అవుతూ ఉంటుంది. తీపి కన్నా కారం అంటే ఎక్కువ ఇష్టం. తన మాటే తుది మాట. వీరికి వచ్చే జీవిత భాగస్వామి ఈ లక్షణా లను అర్థం చేసుకొని ఉండాలి. వీరి అహంకా రాన్ని తృప్తి పరచాలి. వీరు ఏ చిన్న పని చేసినా పొగడటం మెచ్చుకోవడం వంటివి తప్పనిసరిగా చేయాలి. తుది నిర్ణయం వీరికే వదిలేయాలి. వీరికి ఎటువంటి పరిస్థితులలోనూ ఎదురు తిరగకూడదు.  ఈ విధంగా వ్యవహరిస్తే దాంపత్య జీవితం ఆనందంగా ముందుకు సాగిపోతుంది. నిజానికి వీరిలో పశ్చాత్తాప ధోరణి కూడా ఎక్కువే. వీరు ఒక మాట అన్నప్పటికీ ఆ తరువాత వెంటనే పశ్చాత్తాప పడతారు. మాట అన్నందుకు బాధపడతారు. సాధారణంగా వీరితో దాంపత్య జీవితం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ ఉంటుంది.
  2. వృషభం, కన్య, మకరం: ఈ మూడు రాశుల వారికి కుటుంబ ప్రయోజనాలు అన్నిటికన్నా ముఖ్యమైనవి. కుటుంబం కోసం అహర్నిశలు పాటుపడతారు. జీవిత భాగస్వామిని సంతృప్తి పరచడానికి వీలైనన్ని మార్గాలు అనుసరిస్తూ ఉంటారు. వీరికి జీవిత కాలమంతా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగిపోతూ ఉంటుంది. తమ ప్రయోజనాలను పక్కనపెట్టి జీవిత భాగస్వామి ప్రయోజనాల కోసం ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుంటారు. జీవిత భాగస్వామితో బయట తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం. దీన్ని గొప్ప అదృష్టంగా భావిస్తారు. అయితే వీరిని ఎటువంటి పరిస్థితులలోనూ రెచ్చగొట్టడం, సవాలు చేయడం, నిలదీయడం వంటివి చేయకూడదు. సాధారణంగా వీరు శాంత స్వభావులు. ఒక పట్టాన కోపం తెచ్చుకోరు. కోపం వచ్చిందంటే వీరిని శాంత పరచడం చాలా కష్టం. ఈ లక్షణాలను అర్థం చేసుకొని జీవిత భాగస్వాములు వ్యవహరిస్తే వీరి దాంపత్య జీవితం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది.
  3. మిథునం, తుల, కుంభం: ఈ రాశుల వారిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. మనసులోని విషయాలను ఈ రాశుల వారు ఎవరితోనూ ఒక పట్టాన పంచుకోరు. ప్రతి విషయంలోనూ సొంత నిర్ణయాలకే ప్రాధాన్యం ఇస్తారు. ఎవరినీ అంత త్వరగా నమ్మరు. పైగా బయట స్నేహితులకు ఇచ్చినంత ప్రాధాన్యం కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం వల్ల దాంపత్య జీవితంలో తరచూ సమస్యలు తలెత్తు తుంటాయి. దాంపత్య జీవితం మీద తమకు శ్రద్ధ లేనట్టు ప్రవర్తిస్తుంటారు. సాధారణంగా ఎక్కువ విడాకుల కేసులు ఈ రాశుల వారికి చెందినవే అయి ఉంటాయి. నిజానికి వీరికి మనసులో జీవిత భాగస్వామి పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ దానిని ఏ విధంగానూ బయటపెట్టరు. పైగా ఈ రాశుల వారికి కుటుంబంతో కాలక్షేపం చేయ గలిగినంత సమయం కూడా ఉండదు. ఉద్యో గంలో ఉన్నా, వృత్తిలో ఉన్నా లేక వ్యాపారంలో ఉన్నా వీరు ఎక్కువ సమయం తమ విధి నిర్వ హణలోనే మునిగి తేలుతుంటారు. అందువల్ల ఈ రాశుల వారిని అర్థం చేసుకోగలిగితే సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది.
  4. కర్కాటకం, వృశ్చికం, మీనం: ఈ రాశి వారికి సంసార తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరిలో పొసెసివ్ నెస్ హద్దులు మీరి ఉంటుంది. తన జీవిత భాగస్వామి తనకే సొంతం, తనకే ప్రాధాన్యం ఇవ్వాలి, తన మాటే వినాలి అనే భావన వీరిలో అధికంగా ఉంటుంది. మానసికమైన, భావోద్వేగపరమైన అనుబంధం వీరి సహజ లక్షణం. వీరు తన నిర్ణయాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో జీవిత భాగస్వామి నిర్ణయాలకు అంతే ప్రాధాన్యం ఇస్తారు. తన మాట విన్నంత కాలం, తనకు విలువ ఇస్తున్నంత కాలం జీవిత భాగస్వామిని నెత్తిన పెట్టుకుంటారు. వాస్తవానికి వీరు మానసికంగా జీవిత భాగస్వామి మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రాశుల వారికి జీవిత భాగస్వామి నుంచి గుర్తింపు అవసరం. ఈ లక్షణాలకు అనుగుణంగా వ్యవహరించినంత కాలం దాంపత్య జీవితం మూడు పూవులు ఆరు కాయలుగా సాగిపోతుంది.
  5. ఇవి కూడా చదవండి

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..