Horoscope Today: ఆ రాశుల వారికి అనుకూల పరిస్థితులు.. సోమవారం రాశిఫలాలు..

Horoscope Today (10 ఏప్రిల్ 2023 ): తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి సోమవారం.. రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Horoscope Today: ఆ రాశుల వారికి అనుకూల పరిస్థితులు.. సోమవారం రాశిఫలాలు..
HoroscopeImage Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 10, 2023 | 6:21 AM

Horoscope Today (10 ఏప్రిల్ 2023 ): తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి సోమవారం.. రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. బాగా ఒత్తిడి పెరిగినప్పటికీ ముఖ్యమైన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ప్రయోజనం లేని పనులను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ అందుకు సమానంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పు కనిపిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దూర ప్రాంతంలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్త.. అనవసర పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): విదేశాల్లో ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. పొదుపు సూత్రాలను పాటిస్తారు. కొందరు మిత్రులు అండగా నిలబడి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న బాకీ ఒకటి వసూలు అవుతుంది. పిల్లలు చదువుల్లో అభివృద్ధి సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు ఎంతో ఉదారంగా సహాయం చేస్తారు. వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. బందు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఐటీ వారు ఉద్యోగాల్లోకి మారటానికి అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): అధికారులు మీ ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య సమస్య ఒకదానికి పరిష్కారం కనిపిస్తుంది. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వైద్య విద్యార్థులు మాత్రం కొద్దిగా రాణిస్తారు. ఇతరులకు బాగా ప్రయోజనం కలిగించే పనులు చేస్తారు.
  7. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక విషయాలలో సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎదిగే సూచనలు ఉన్నాయి. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. సామాజిక రంగంలోని వారికి గౌరవ మర్యాద పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది.
  8. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అయితే, తనకు మాలిన ధర్మంగా ఇతరులకు భారీగా సహాయం చేస్తారు. పెళ్లికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ పరంగా దూరప్రాంతం నుంచి మంచి సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన విధంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. పిల్లల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు.
  9. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. ఆహార విహారాల్లో క్రమశిక్షణ అవసరం. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. సాయం పొందిన స్నేహితులు ముఖం చాటేస్తారు. నిరుద్యోగులకు రెండు మూడు ఆఫర్లు వస్తాయి.
  10. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కొద్దిగా రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి సమయం అనుకూలంగా ఉంది. దగ్గర బంధువులతో అపార్ధాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడానికి ఇది మంచి సమయం. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పిల్లల సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
  11. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు చక్కబడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు శక్తికి మించి సహాయం చేస్తారు. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. వృత్తి నిపుణులు తమ రంగంలో కొత్త పుంతలు తొక్కుతారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. హామీలు ఉండటం, వాగ్దానాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండండి.
  12. కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. రాని బాకీలు వసూలు అవుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. కొన్ని వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా సానుకూలంగా పరిష్కారం అవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. స్నేహితుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
  13. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఒకటి రెండు ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. డాక్టర్లకు, లాయర్లకు క్షణం తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఐటీ రంగం వారికి మంచి కంపెనీల నుంచి అవకాశాలు వస్తాయి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..