Kurnool: ఇక్కడ శివపార్వతుల కళ్యాణం తర్వాత పూజారితో తన్నులు తింటే మోక్షం కలుగుతుందట.. ఈ తన్నుల కథ ఏమిటంటే?

శివపార్వతుల కల్యాణం ముగిసిన తరువాత భక్తులు ఆలయం ముందు వరస క్రమంలో బారులు తీరుతారు. ఆలయ పూజారి స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఒక చేతితో త్రిశూలం పట్టుకొని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటికి పరుగు పరుగున వస్తాడు.

Kurnool: ఇక్కడ శివపార్వతుల కళ్యాణం తర్వాత పూజారితో తన్నులు తింటే మోక్షం కలుగుతుందట.. ఈ తన్నుల కథ ఏమిటంటే?
Siddeshwara Swamy Temple
Follow us
Surya Kala

|

Updated on: Apr 07, 2023 | 5:06 PM

పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని అక్కడ భక్తుల అపార నమ్మకం. ఆయన కాలి తన్నుల కోసం భక్తులు బారులు తీరుతారు. కాలితో తన్నించుకొన్న వారు ఆలయంలో పూజలు నిర్వహించి వెళ్ళిపోతారు. ఈ భక్తి కాలి తన్ను క్రీడకు వేదిక కర్నూలు జిల్లా.. మరి సినిమాను తలపిస్తున్న ఈ తన్నుల స్వామి గురించి తెలుసుకుందాం. జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం చిన్నహోతురు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వరస్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు శివపార్వతులకు ఆలయ ప్రాంగణంలో కల్యాణం జరిపిస్తారు

పూజారి కాలి తన్ను కథ ఏమిటంటే? మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి శివుడు భక్తుడు ఆయన 500 వందల సంవత్సరాలకు ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. ఆ ఆలయంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకొన్నట్లు స్థానికుల కథనం. ప్రతి ఏటా కర్నాటక లోనే హంపి వీరుపాక్షి స్వామి రధోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్నహోతురు లో కూడా అదే తరహాలో మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి నిర్వహించే వాడని భక్తులు అంటున్నారు. అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి శివ పార్వతులకు కళాణ్యం జరిపించే వారని ఆలయ చరిత్రలో ఉందని భక్తులు అంటున్నారు. శివపార్వతుల కల్యాణం లో శ్రీ సిద్ద రామేశ్వర స్వామిభక్తులు కొన్నితప్పులు చేయడంతో శివుడు కుమారుడు వీరభద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట

వీరభద్ర స్వామి ఆలయ పూజారి..  గుడిలో ఉన్న త్రిశూలం తీసుకొని శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఆగ్రహం తో నాట్యం చేస్తు భక్తులను తన కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అలా స్వామి వారి కాలి తన్నులు తిన్న వారికి మోక్షం లభించిందని స్థానికులు చెబుతారు. అప్పడు ప్రారంభమైన ఈ ఆచారం.. దాదాపు 500 ఏళ్ల నాటి నుంచి కొనసాగుతుంది. ఈ సంప్రదాయం భక్తి క్రీడను తాము ఇప్పటికి కొనసాగిస్తున్నామని చెబుతున్నారు

ఇవి కూడా చదవండి

నేటికీ అదే ఆచారం శివపార్వతుల కల్యాణం ముగిసిన తరువాత భక్తులు ఆలయం ముందు వరస క్రమంలో బారులు తీరుతారు. ఆలయ పూజారి స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఒక చేతితో త్రిశూలం పట్టుకొని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటికి పరుగు పరుగున వస్తాడు. వరస క్రమంలో ఉన్న కొందరి భక్తులను నాట్యం చేస్తూ కాలితో తన్నుకుంటూ వెళ్తాడు. పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామి వార్లకు పూజలు నిర్వహించి అక్కడినుంచి వెళ్ళిపోతారు.  ఇలా తన్నితే తమకు మోక్షం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

ఒకే రంగుతో వసంతోత్సవం పూజారి తన్నుల సేవా కార్యక్రమం ముగిసిన తరువాత స్వామి వార్లకు భక్తులు వసంతోత్సవం గులాబీ రంగు ఉన్న నీటితో జరిపిస్తారు. స్వామి వార్ల వసంతోత్సవం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకొన్న పెద్ద గుంతలలో గులాబీ రంగు నీళ్లు కలుపుకొని వారు కూడా ఆ గులాబీ రంగు నీళ్లతో వసంతోత్సవం జరుపుకొంటారు. ఇది సంప్రదాయం అని గ్రామస్తులు అంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
అప్పట్లో గ్లామర్ పాత్రలతో అల్లాడించేసింది.. గుర్తుపట్టలేనంతగా..
అప్పట్లో గ్లామర్ పాత్రలతో అల్లాడించేసింది.. గుర్తుపట్టలేనంతగా..
ఈడు ఎవడ్రా బాబు.. మోసం చేయడంలో పీహెచ్‌డీ చేసినట్లు ఉన్నాడు..
ఈడు ఎవడ్రా బాబు.. మోసం చేయడంలో పీహెచ్‌డీ చేసినట్లు ఉన్నాడు..
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాపై ఆంక్షలు.. మినిమమ్ ఏజ్ విధింపు
ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాపై ఆంక్షలు.. మినిమమ్ ఏజ్ విధింపు
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
మెట్లపై పడిపోయిన విజయ్ దేవరకొండ..
మెట్లపై పడిపోయిన విజయ్ దేవరకొండ..
3 ఏళ్లుగా ఎదురుచూపులు.. ఐపీఎల్ 2025కి ముందు నెరవేరిన డ్రీమ్
3 ఏళ్లుగా ఎదురుచూపులు.. ఐపీఎల్ 2025కి ముందు నెరవేరిన డ్రీమ్
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
పరీక్షలో ఫెయిల్ అయినట్లు కల వచ్చిందా.? దాని అర్థం ఏంటంటే..
పరీక్షలో ఫెయిల్ అయినట్లు కల వచ్చిందా.? దాని అర్థం ఏంటంటే..
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!
కృష్ణవేణి అలలపై సోమశిల-శ్రీశైలం లాంచి ప్రయాణం
కృష్ణవేణి అలలపై సోమశిల-శ్రీశైలం లాంచి ప్రయాణం