Tirumala Rush: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. పెరిగిన భక్తుల రద్దీ.. శిలా తోరణం వరకూ క్యూ లైన్.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే

తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఏపీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, సినీ హీరోలు గోపీచంద్, అల్లరి నరేష్ లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Tirumala Rush: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. పెరిగిన భక్తుల రద్దీ.. శిలా తోరణం వరకూ క్యూ లైన్.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే
Tirumala Rush
Follow us
Surya Kala

|

Updated on: Apr 08, 2023 | 9:54 AM

కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. వైకుంఠ వాసుడు.. శ్రీనివాసుడిని తమ జీవితంలో ఒక్కసారినా దర్శించుకోవాలని..ఆపద మొక్కులవాడికి తమ మొక్కులు తీర్చుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. వీలైనప్పుడు శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ, విదేశాల నుంచి భక్తులు ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వరస సెలవులు కావడంతో.. శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకు పోటెత్తారు భక్తులు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, ఇంటర్ పరీక్షలు పూర్తవ్వడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

టోకెన్ లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్ శిలా తోరణం వరకు చేరుకుంది. గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి భక్తులను క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది‌

తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఏపీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, సినీ హీరోలు గోపీచంద్, అల్లరి నరేష్ లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం బయట స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సౌభాగ్యంతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

హీరో గోపీచంద్ మాట్లాడుతూ తాను నటించిన రామబాణం సినిమా మే 5వ తేది విడుదలవుతున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోసం వచ్చానని చెప్పారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ తాను నటించిన ఉగ్రం సినిమా మే 5న విడుదలవుతుందని చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..