Ganga Pushkaralu: ఈ నెలలో గంగ పుష్కరాలు ప్రారంభం.. ఏ ఏ ప్రాంతాల్లో పుష్కరాలు జరగనున్నాయంటే..

నదులకు పన్నెండేళ్లకో సారి వచ్చే పెద్దపండగ పుష్కరాలకు గంగానది ముస్తాబవుతోంది. పుష్కరాలు జరిగే ఈ పన్నెండురోజులూ గంగా నది తీర ప్రాంతాలైన గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బదిరీనాథ్‌, కేదారనాథ్‌, వారణాసి, అలహాబాద్‌ క్షేత్రాలు పుష్కరశోభను సంతరించుకుంటున్నాయి.

Ganga Pushkaralu: ఈ నెలలో గంగ పుష్కరాలు ప్రారంభం.. ఏ ఏ ప్రాంతాల్లో పుష్కరాలు జరగనున్నాయంటే..
Ganga Pushkaralu
Follow us
Surya Kala

|

Updated on: Apr 07, 2023 | 11:20 AM

హిందూ సనాతన ధర్మంలో నదులకు విశిష్ట స్థానం ఉంది. నదులను పవిత్రంగా భావించి పూజిస్తారు. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైంది. గంగానదిని, గంగమ్మ తల్లి,  పావన గంగ, గంగా భవాని అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. అలాంటి పవిత్ర గంగా నది పుష్కరాలు ఏప్రిల్ 22న ప్రారంభం కానున్నాయి. పుష్కరం అంటే 12 ఏళ్లు అని అర్ధం. గంగా పుష్కరాలు బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినపుడు ఏప్రిల్ 22న ప్రారంభం కానున్నాయి. బృహస్పతి మళ్ళీ మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు మే 3 తేదీన ముగియనున్నాయి. గంగా పుష్కరాలు అలహాబాద్, గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్‌నాథ్ సంగం ప్రయాగ నగరాల్లో జరగనున్నాయి.

గంగానది పుష్కర వైభవం

నదులకు పన్నెండేళ్లకో సారి వచ్చే పెద్దపండగ పుష్కరాలకు గంగానది ముస్తాబవుతోంది. పుష్కరాలు జరిగే ఈ పన్నెండురోజులూ గంగా నది తీర ప్రాంతాలైన గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బదిరీనాథ్‌, కేదారనాథ్‌, వారణాసి, అలహాబాద్‌ క్షేత్రాలు పుష్కరశోభను సంతరించుకుంటున్నాయి. పవిత్ర గంగా నదిలో స్నానం చేయడం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో పవిత్ర క్షేత్రాలు  కళకళలాడతాయి.

ఇవి కూడా చదవండి

బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు, బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి పన్నెండు రోజులనూ ఆది పుష్కరాలుగా, చివరి పన్నెండు రోజులనూ అంత్య పుష్కరాలుగా వేడుకలు నిర్వహిస్తారు.

పుష్కర సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారు. ఆ నీటిలో స్నానంచేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారనీ పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యలో 12ఏళ్ల తర్వాత పవిత్ర గంగమ్మ పుష్కరాల వేడుకను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో రోజు దాదాపు 25 లక్షల మంది భక్తులు గంగానదిలో స్నానమాచరిస్తాయని అంచనావేస్తున్నారు.  ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!