Tirumala: శ్రీవారి నిజపాద దర్శనం వీలుకాదన్న ఈవో.. మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం..

ఈ ఓ ధర్మారెడ్డి నిర్వహించిన టీటీడీ డయల్ యువర్ కార్యక్రమంలో శ్రీవారి నిజపాద దర్శన పునః ప్రారంభించాలని భక్తులు కోరారు.  అయితే శుక్రవారం శ్రీవారి ఆలయంలో సమయాభావం కారణంగా నిజపాద దర్శనాన్ని పున్నరుద్దరించలేమని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

Tirumala: శ్రీవారి నిజపాద దర్శనం వీలుకాదన్న ఈవో.. మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం..
Tirumala Temple
Follow us
Surya Kala

|

Updated on: Apr 07, 2023 | 1:14 PM

తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిజపాదాలను భక్తులు శుక్రవారం దర్శించుకునేవారు. గత కొంతకాలం క్రితం వరకూ భక్తులకు భగవంతుడు గోవింద విగ్రహం యొక్క పవిత్ర పాదాలను చూసే అవకాశం ఉండేది.. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఓ ధర్మారెడ్డి నిర్వహించిన టీటీడీ డయల్ యువర్ కార్యక్రమంలో శ్రీవారి నిజపాద దర్శన పునః ప్రారంభించాలని భక్తులు కోరారు.  అయితే శుక్రవారం శ్రీవారి ఆలయంలో సమయా భావం కారణంగా నిజపాద దర్శనాన్ని పున్నరుద్దరించలేమని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. నిజపాద దర్శనం వల్ల స్వామివారికి నైవేద్యం ఆలస్యం అవుతుందని తెలిపారు.

అంతేకాదు ఆలయంలో సుదర్శనం, గోవర్ధన్, కల్యాణి సత్రాలల్లో పారిశుధ్యం బాగాలేదని ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ఈ మూడు సత్రాల స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. స్వామివారి అన్న ప్రసాద వితరణలో నాణ్యతని పెంచేందుకు ఇక పై టెండర్ల ద్వారా కాకుండా మిల్లర్ల ద్వారా బియ్యాని సేకరిస్తామని తెలిపారు.

మార్చి నెలలో భక్తులు

ఇవి కూడా చదవండి

మార్చి నెలలో శ్రీవారిని  20లక్షల 57 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 8.25 లక్షల భక్తులు తలనీలాల సమర్పించారు. అంతేకాదు మార్చి నెలలో హుండీ ఆదాయం రికార్డ్ స్థాయికి చేరింది. భక్తుల కానుకల ద్వారా హుండీ ద్వారా రూ.120.29 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నారు. స్వామివారి ప్రసాదం లడ్డులు 1.02 కోట్లను విక్రయించినట్లు తెలిపారు.

నిజపాద దర్శనం: 

తిరుమలలో భక్తులకు వారానికో ప్రత్యేక దర్శనం నిజపాద దర్శనం. ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూరా అభిషేకం సేవ నిర్వహిస్తారు. ఈ సేవ చేసే సమయంలో స్వామివారి విగ్రహానికి అలంకరించిన ఆభరణాలు, అలంకరణలు తొలగిస్తారు. ఈ సేవ  అనంతరం.. గోవింద పవిత్ర పాదాలను ఎటువంటి అలంకరణ లేకుండా చూసే అవకాశం భక్తులకు ఇస్తారు. దీనినే నిజపాద దర్శనం అంటారు. లోపలి ఆలయంలో 1వ ద్వారం నుండి బంగారు కవచాలు లేకుండా భక్తులు నేరుగా శ్రీవారి పాదాలను దర్శించుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?