AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి వస్తువులను ఏ రాశి ప్రకారం కొనడం శుభప్రదం అంటే..

అక్షయ తృతీయను హిందూ మతంలో చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ఎటువంటి ముహూర్తాలను చూసుకోకుండా శుభ కార్యాలు చేయవచ్చు, ముఖ్యంగా షాపింగ్ చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం మీరు మీ రాశిచక్రం ప్రకారం వస్తువులను కొనుగోలు చేస్తే.. అది మరింత శుభ ఫలితాలను ఇస్తుంది.

అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి వస్తువులను ఏ రాశి ప్రకారం కొనడం శుభప్రదం అంటే..
Akshaya Tritiya 2025
Surya Kala
|

Updated on: Apr 24, 2025 | 7:21 AM

Share

అక్షయ తృతీయ రోజున రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులను కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున కొనుగోలు చేసిన వస్తువులు ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తాయని నమ్ముతారు. రాశి ప్రకారం అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొనడం శుభప్రదమో జ్యోతిష్కులు చెప్పిన సలహాలు సూచనల గురించి తెలుసుకుందాం.

అక్షయ తృతీయ 2025 తేదీ ఎప్పుడంటే

వాస్తవానికి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 5:29 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం, అక్షయ తృతీయను 2025 ఏప్రిల్ 30న జరుపుకుంటారు.

అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ సమయం

అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే బంగారం సంపద శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం బంగారం కొనడానికి అత్యంత పవిత్రమైన సమయం ఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు.

ఇవి కూడా చదవండి

అక్షయ తృతీయ రోజున రాశి ప్రకారం ఏ వస్తువులను కొనాలంటే

  1. మేష రాశి: ఈ రాశి వారికి బంగారం కొనడం శుభప్రదం. మీరు బంగారు ఉంగరం లేదా ఏదైనా చిన్న ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.
  2. వృషభం: వృషభ రాశి అధిపతి శుక్రుడు.. వెండి శుక్రుడికి సంబంధించినది. అందువల్ల ఈ రాశి వారు వెండి ఆభరణాలు, నాణేలు కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  3. మిథున రాశి: బంగారు గొలుసు లేదా చెవిపోగులు కొనడం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
  4. కర్కాటకం: కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు వెండికి సంబంధించినవాడు. కనుక ఈ రాశి వారు ఏదైనా వెండి వస్తువు కొనడం శుభప్రదం.
  5. సింహ రాశి: సింహ రాశి వారు బంగారం కొనడం చాలా శుభప్రదం. ఈ రాశి వారు బంగారు లాకెట్ లేదా గొలుసు కొనవచ్చు.
  6. కన్య రాశి : కన్య రాశి వారికి, బంగారు గాజులు, ముక్కు పుడక లేదా ఉంగరం కొనడం వల్ల కెరీర్‌లో విజయం సాధించవచ్చు.
  7. తుల రాశి: తుల రాశి వారు వెండి పట్టీలు కొని లక్ష్మీ దేవికి సమర్పించి ధరించాలి. ఇది వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని, మానసిక శాంతిని కాపాడుతుంది.
  8. వృశ్చిక రాశి: ఈ రాశి వారు బంగారు ముక్కు పుడక లేదా ఉంగరం కొనడం శుభప్రదం. అయితే ఈ రాశి అధిపతి కుజుడు కనుక పరిమిత పరిమాణంలో బంగారాన్ని ఉపయోగించడం మంచిది.
  9. ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి బంగారం ధరించడం చాలా ప్రయోజనకరం. మీరు బంగారు గొలుసు, పాపిడి బొట్టు లేదా ఏదైనా ఇతర ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.
  10. మకర రాశి, కుంభ రాశి: ఈ రెండు రాశుల అధిపతి శనిశ్వరుడు. వెండికి సంబంధించినది. కనుక ఈ రాశుకి సంబంధించిన వ్యక్తులు వెండి ఆభరణాలు లేదా కాళ్ళ పట్టీలు కొనడం శుభప్రదం.
  11. మీనం రాశి: మీన రాశి అధిపతి బృహస్పతి. బంగారం బృహస్పతికి సంబంధించినది. కనుక ఈ రాశి వ్యక్తులు గాజులు, నెక్లెస్ లేదా చెవిపోగులు వంటి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం శుభప్రదం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!