AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahma Kamalam: వైట్, పింక్ కలర్ లో వికసిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోన్న బ్రహ్మ కమలం పువ్వులు..

రాత్రి వికసించి ఉదయం వాడిపోయే పువ్వుల్లో బ్రహ్మకమలం ఒకటి. వీటిని నిశాగంధి అని కూడా అంటారు. ఈ పువ్వుల పట్ల హిందువుల్లో అనేక నమ్మకాలున్నాయి. బ్రహ్మ కమలం వికసించే సమయంలో ప్రజలను ఆకర్షిస్తాయి. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ బ్రహ్మ కమలం పువ్వులు తెలుపు, గులాబీ రంగులలో వికసిస్తాయి. ఈ పువ్వులు జ్వరం, జలుబు, ఉబ్బసం చికిత్సకు ఔషధంగా ఉపయోగపడతాయి. తాజాగా తమిళనాడులోని పర్వత నగరంలో బ్రహ్మ కమలాలు వికసించాయి. ఈ పువ్వులను చూసి ఆనందిస్తున్నారు.. పర్యాటకులు ఫోటోలు దిగుతున్నారు.

Brahma Kamalam: వైట్, పింక్ కలర్ లో వికసిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోన్న బ్రహ్మ కమలం పువ్వులు..
Bhrahma Kamalam Flowers
Surya Kala
|

Updated on: Apr 24, 2025 | 12:19 PM

Share

తమిళనాడు కొడైకెనాల్‌లోని ఉగార్టే నగర్ ప్రాంతంలోని జాన్ కెన్నెడీ ఇంటి టెర్రస్ గార్డెన్‌లో రాత్రిపూట మాత్రమే వికసించే అరుదైన నిషా కాంతి (బ్రహ్మ కమల) పువ్వులు వికసిస్తున్నాయి. తెలుపు, గులాబీ రంగుల్లో వికసించే ఈ పూలు సువాసనతో నిండి సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఇవి ఔషధ గుణాలను కలిగి ఉంటాయని.. జ్వరం, జలుబు, ఉబ్బసం వంటి వ్యాధుల నివారణ కోసం ఉపయోగించబడుతున్నాయని చెబుతారు. రాత్రి వికసించిన కొన్ని గంటల తర్వాత మళ్ళీ మొగ్గలుగా మారే ఈ పువ్వులను ప్రజలు భక్తిశ్రద్దలతో పుజిస్తారు. మొక్క దగ్గర దీపాలు వెలిగిస్తారు. పర్యాటకులు ఈ పువ్వులను చూసి ఆనందిస్తున్నారు. వాటి దగ్గర ఫోటోలు తీసుకుంటున్నారు.

టెర్రస్ తోటలో సాయంత్రం వికసించే పువ్వులు

కొడైకెనాల్‌లోని ఉగార్టే నగర్ ప్రాంతంలో నివసించే జాన్ కెన్నెడీ తన ఇంటి పైకప్పు తోటలో నిషాకాంతి అని పిలువబడే అరుదైన బ్రహ్మ కమలం మొక్కలను పెంచుతున్నాడు. ఈ పువ్వులు తెల్లని రంగులో ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఇవి కాక్టస్ కుటుంబానికి చెందినవని.. వీటి కాండాలను కత్తిరించి మళ్ళీ భూమిలో పాతిపెడితే మొక్కలు పెరుగుతాయని చెబుతున్నారు. ఈ పువ్వులు దాదాపు 10 మీటర్ల వరకూ తమ సువాసనను వ్యాపింపజేస్తాయి. ఈ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వికసించే ఈ అద్భుత పుష్పం ఆకు నుండే వికసిస్తుంది.

పువ్వులతో ఔషధ ఉపయోగాలు

బ్రహ్మ కమలం వికసించే కాలంలో.. ఎంతో మంచి సువాసన వస్తుంది. ఈ పువ్వులు వికసించి కొన్ని గంటల్లోనే మొగ్గలుగా మారుతాయి. ఆ సమయంలో, మీరు ప్రజలు దీపాలు వెలిగించి వాటిని పూజించడం చూడవచ్చు. ఈ పువ్వులు వికసించే సమయంలో స్థానికులు, పర్యాటకులు ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి, ఫోటోలు తీసుకోవడానికి వస్తారు. తెలుపు, గులాబీ రంగుల్లో వికసించే ఈ పూలు చూపరులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

వేసవి రద్దీ

వేసవి సెలవుల కోసం దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ప్రస్తుతం కొడైకెనాల్‌కు తరలివస్తున్నారు. మోయిర్ పాయింట్, బ్రయంట్ పార్క్, పైన్ ఫారెస్ట్, స్టార్ లేక్ వంటి ప్రదేశాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది.

ప్రకృతితో కలిసి జీవించడం ఒక బహుమతి

పశ్చిమ కనుమల ఆలింగనంలో ఉన్న కొడైకెనాల్, చల్లని వాతావరణం, ఉప్పొంగే జలపాతాలు, బోటింగ్, సైక్లింగ్ ,గుర్రపు స్వారీ , ఆధునిక సౌకర్యాలతో హోటళ్ళు, రెస్టారెంట్లతో అన్ని వయసుల వారికి ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించే పర్యాటక కేంద్రం. ఈ పచ్చని పర్వత నగరంలో బ్రహ్మ కమలాల అద్భుత వికసనం కూడా పర్యాటకులను ఆకర్షించే ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..