AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Attack: సరిహద్దు అవతల నుంచే హ్యాండ్లర్ కు శిక్షణ.. యాప్ ద్వారా పర్యాటకుల దగ్గరకు చేరుకున్న ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పక్కా ప్లాన్ తోనే జరిపారు. ఇక్కడ పర్యాటకుల మీద దాడి చేసేందుకు ఉగ్రవాదులు ప్రత్యేక సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం, నిఘా సంస్థ ఐఎస్ఐ సహాయంతోనే ఉగ్రవాదులు ఈ దాడులను విజయవంతంగా నిర్వహించారని చెబుతున్నారు. ఈ ఉగ్రవాదులకు దాడి కోసం సరిహద్దు అవతల నుంచి సరైన శిక్షణ ఇవ్వబడింది.

Pahalgam Attack: సరిహద్దు అవతల నుంచే హ్యాండ్లర్ కు శిక్షణ.. యాప్ ద్వారా పర్యాటకుల దగ్గరకు చేరుకున్న ఉగ్రవాదులు
Pahalgam Attack
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: May 21, 2025 | 5:10 PM

Share

జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. దర్యాప్తు సంస్థలు దర్యాప్తుని వేగవంతం చేశారు. దాడి చేసిన ఉగ్రవాదులను చేరుకోవడానికి తమ దర్యాప్తును ప్రారంభించాయి. ఈ దర్యాప్తులో దాడికి సంబంధించి కొత్త విషయాలు నిరంతరం వెల్లడవుతున్నాయి. ఈ ఉగ్రవాదుల వద్ద ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ఉందని.. దీని సహాయంతో వారు పహల్గామ్ దట్టమైన అడవుల నుంచి బైసరన్ ప్రాంతానికి చేరుకోగలిగారని వర్గాల నుంచి సమాచారం అందింది. పర్యాటకులను మతం గురించి అడిగిన తర్వాత ఉగ్రవాదులు అక్కడిక్కడే కాల్పులు జరిపి చంపేశారు. ఈ నరమేథంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇంటెలిజెన్స్ భద్రతా సంస్థకు సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం.. ఉగ్రవాదులు పహల్గామ్ దట్టమైన అడవులలోని పర్యాటక ప్రదేశానికి చేరుకోవడానికి ఆల్పైన్ క్వెస్ట్ అప్లికేషన్‌ను ఉపయోగించారు. గతంలో కూడా.. జమ్మూ అడవుల్లో భారత జవాన్లపై దాడులు చేయడానికి ఉగ్రవాదులు ఈ యాప్‌ను ఉపయోగించారు.

ఈ యాప్‌ను పహల్గామ్ అడవులలో ఉపయోగించారు.

భద్రతా సంస్థల అప్రమత్తత కారణంగా యాప్‌ను కూడా ట్రాక్ చేశారు. దీంతో ఉగ్రవాదులు తమ దారిని మార్చి పహల్గామ్ అడవులలో దీనిని ఉపయోగించారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ గుప్తీకరించిన అప్లికేషన్ ద్వారా.. ఉగ్రవాదులు పర్యాటకులు భారీగా ఉన్న పర్యాటక ప్రదేశానికి చేరుకోగలిగారు.

ఇవి కూడా చదవండి

ఉగ్రవాద దాడి తర్వాత కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థల ప్రకారం.. భారత నిఘా సంస్థ ట్రాక్ చేయకుండా ఉండటానికి పాకిస్తాన్ సైన్యం వారికి సహాయం చేసింది. ఈ మొబైల్ యాప్‌ను పాకిస్తాన్ సైన్యం మద్దతుతో అభివృద్ధి చేశినట్లు తెలుస్తుంది.

సరిహద్దు అవతల నుంచే హ్యాండ్లర్ శిక్షణ

ఇది మాత్రమే కాదు.. మొబైల్ యాప్ తయారు చేసిన తర్వాత.. దాని ఉపయోగం గురించి ఉగ్రవాదులకు సరైన శిక్షణ కూడా ఇవ్వబడింది. సరిహద్దు అవతల ఉన్న యాప్ నిర్వాహకులు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలో ఉగ్రవాదులకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులందరికీ ఈ యాప్‌ను ఆపరేట్ చేయడానికి శిక్షణ కూడా ఇవ్వబడింది.

పహల్గామ్ దాడి లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంయుక్త కుట్ర అని నిఘా సంస్థలకు ఇప్పటికే సమాచారం అందింది. పాకిస్తాన్ సైన్యం, నిఘా సంస్థ ISI ఆదేశాల మేరకు ఈ ఉగ్రవాద సంస్థలు చిన్న ‘హిట్ స్క్వాడ్’లను ఉపయోగించి ఉగ్రవాద దాడులు చేస్తున్నాయి.

కొత్త మార్గంలో దాడి చేస్తోన్న ఉగ్రసంస్థలు

ఉగ్రవాదులు పహల్గామ్ దాడి వెనుక ప్రధాన ఉద్దేశ్యం అమర్‌నాథ్ యాత్రకు ముందు యాత్రికులు, పర్యాటకులలో భయాందోళనలు సృష్టించడం. ఈ దాడి వెనుక లష్కరే ఫ్రంట్ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ హస్తం ఉందని నమ్ముతారు.

‘రెసిస్టెన్స్ ఫ్రంట్, ‘హిట్ స్క్వాడ్’, ‘ఫాల్కన్ స్క్వాడ్’ ఇటువంటి దాడులు చేయడంలో నిపుణులు. ఈ ఉగ్రవాద మాడ్యూల్స్‌కు లోయలో లక్ష్య హత్యలు చేయడానికి, దట్టమైన అడవులు, ఎత్తైన ప్రదేశాలలో దాక్కోవడానికి శిక్షణ ఇవ్వబడింది. ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ , ‘ఫాల్కన్ స్క్వాడ్’ అనేది ఉగ్రవాద దాడికి సంబంధించిన కొత్త మాడ్యూల్ అని దీని వద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయని చెబుతారు. ఈ ఉగ్ర సంస్థ హిట్ అండ్ రన్ ప్లాన్ చేస్తుంది. ఓవర్ గ్రౌండ్ వర్కర్లతో కూడా పనిచేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..