AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pitra Dosham: ఇంట్లో అకారణంగా గొడవలు జరుగుతున్నాయా.. పితృ దోషానికి సంకేతం కావచ్చు.. జాగ్రత్త సుమా

ఎటువంటి కారణం లేకుండా మన చుట్టూ సమస్యలు చుట్టుముట్టడం, ఇంట్లో తగాదాలు, కలహాల వాతావరణం ఉండటం వంటివి ఇవి పితృ దోషం లక్షణాలు కావచ్చు. పితృ దోషం అంటే ఏమిటి? ఈ దోషం ఎలా వస్తుంది? దీని లక్షణాలు ఏమిటి? పండితులు చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం.

Pitra Dosham: ఇంట్లో అకారణంగా గొడవలు జరుగుతున్నాయా.. పితృ దోషానికి సంకేతం కావచ్చు.. జాగ్రత్త సుమా
Pitru Dosha
Surya Kala
|

Updated on: Apr 24, 2025 | 8:35 AM

Share

పితృ దోషం అనేది ఒక రకమైన జ్యోతిష దోషం. ఇది వంశస్థులు తమ పూర్వీకులను గౌరవించకపోవడం వల్ల ఏర్పడుతుంది. పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందకపోతే.. వారు తమ వారసులకు ఇబ్బంది కలిగిస్తారని నమ్ముతారు. పూర్వీకుల సరైన శ్రాద్ధ కర్మలు, తర్పణం లేదా పిండ ప్రదానం చేయకపోతే.. అతను పితృ దోషంతో బాధపడవచ్చు. అంతేకాదు ఎవరి ఇంట్లోనైనా బిడ్డ పుట్టిన వెంటనే చనిపోవడం వంటి సంఘటనలు కూడా జరగచ్చు. కుటుంబ సబ్యులు సంతోషంగా ఉన్న సందర్భంలో.. అసంతృప్తిగా ఉన్న ఆత్మ.. తన కుటుంబ సభ్యులతో పాటు తాను కూడా గౌరవించబడాలని, ఆనందంలో పాలుపంచుకోవాలని ఆశిస్తుంది. బహుశా అందుకే సంక్రాంతి పండుగ రోజు ఉదయం పూర్వీకుల కోసం నీరు, వస్త్రం మొదలైన వాటిని పక్కన పెట్టి పూజ చేస్తారు. అదే విధంగా వివాహ సందర్భంగా కూడా వధూవరుల కుటుంబంలో పెద్దలను తలుచుకుంటూ తమ పూర్వీకుల కోసం తెల్లటి వస్త్రం వంటి కొన్ని వస్తువులను పెద్దలకు పెడతారు. ఇలాంటి ఆచారాలను పాటించిన చోట సాధారణంగా ఎటువంటి సమస్యలు ఉండవు. అదే సమయంలో పెద్దలకు స్మరించడం విస్మరించి.. వారి ఆత్మ శాంతి కోసం ఎటువంటి ఆచారాలను పాటించని చోట, తరచుగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి.

జాతకంలో పితృ దోషం ఎప్పుడు ఏర్పడుతుందంటే

సూర్యుడు మన పితృ (పూర్వీకుల), రాహువు నీడ సూర్యునిపై పడినప్పుడు.. సూర్యుని సానుకూల శక్తి ప్రభావం తగ్గుతుంది. అనగా రాహువు సూర్యుడితో ఉన్నప్పుడు లేదా రాహువు ఐదవ ఇంట్లో ఉన్నప్పుడు, సూర్యుడు రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు లేదా ఐదవ ఇంటి అధిపతి రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు.. జాతకం ఆధారంగా దానిని పితృ దోషం అంటారు.

వాస్తుతో పితృ దోషానికి సంబంధం

  1. పితృ దోషానికి వాస్తుతో ఉన్న సంబంధం కూడా తరచుగా కనిపిస్తుంది. పితృ దోషం ఉన్న జాతకుల ఇళ్ళలో కొన్ని వాస్తు దోషాలు తరచుగా కనిపిస్తాయి.
  2. ఈశాన్య మూలలో లేదా నైరుతి మూలలో ఖచ్చితంగా టాయిలెట్ ఉండడం
  3. ఇవి కూడా చదవండి
  4. నైరుతి మూలలో టాయిలెట్ లేదా చెత్తబుట్ట లేదా మురుగు కాలువ ఉండటం.
  5. నైరుతిలో ధూళి ఉండటం వల్ల రాహువు ప్రతికూల శక్తి చాలా రెట్లు పెరుగుతుంది. ఇది వివాహ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది.
  6. ఇంట్లో వాస్తు లోపం ఉంటే వైవాహిక జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు అది విడాకులకు కూడా దారితీస్తుంది.
  7. ఎవరి వ్యక్తి ఇంట్లో అయినా ఎటువంటి కారణం లేకుండా తరచుగా గొడవలు జరుగుతుంటే.. ఖచ్చితంగా వాస్తు లోపం పితృ దోషం ఉన్నట్లే భావించాలని పండితులు చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు