రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. తాడు తెగిపోవడంతో రథం పైభాగం కూలిపోయింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు పరుగులు పెట్టారు. ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ముల్కీ పట్టణం సమీపంలోని బప్పనాడు గ్రామంలో షాంభవి నది ఒడ్డున దుర్గా పరమేశ్వరి ఆలయం ఉంది.
ఏటా ఏప్రిల్ లో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా బ్రహ్మ రథోత్సవం జరుపుతారు. శుక్రవారం రాత్రి రథోత్సవం నిర్వహించారు. దేవతతో పాటు పూజారులున్న రథాన్ని వేలాది మంది భక్తులు లాగారు. బ్రహ్మ రథోత్సవం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ రథానికి కట్టిన తాడు తెగిపోయింది. దీంతో విద్యుత్ అలంకరణతో ఉన్న రథం పైభాగం కూలిపోయింది. అప్రమత్తమైన భక్తులు దూరంగా పరుగులు తీరడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మిగతా రథాలతో ఊరేగింపును కొనసాగించారు.
మరిన్ని వార్తల కోసం :
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో
యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
వైరల్ వీడియోలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
