అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో
తన కూతుర్ని ఇచ్చి వారం రోజుల్లో వివాహం జరిపించాల్సిన అల్లుడితో ఎలిపోయిన అత్త కథలో సూపర్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బుధవారం స్వప్న, రాహుల్ పోలీసుల దగ్గర సరెండర్ అయ్యారు. ఏది ఏమైనా తాను రాహుల్ తోనే జీవిస్తానని, అతడిని పెళ్లి చేసుకుంటానని తెలిపింది. అలాగే తాను ఇంట్లోనుంచి వెళ్ళేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకు వెళ్ళినట్టు తన భర్త చేసిన ఆరోపణలు నిజం కాదని తెలిపింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన స్వప్న ఈ క్రమంలో తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో పోలీసులకు వివరించింది.
తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతు అని, తరచూ తాగి వచ్చి తనని కొట్టేవాడని, తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. తాను ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు డబ్బు, నగలు తీసుకు వెళ్ళలేదని, తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్, రెండు వందల రూపాయలు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. మరోవైపు తనను స్వప్న బెదిరించడంతోనే ఆమెతో పారిపోవడానికి ఒప్పుకున్నట్టు రాహుల్ కుమార్ చెప్పాడు. అలీఘర్ పోలీస్ స్టేషన్ లో కలవకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని స్వప్న తనకు ఫోన్ లో చెప్పిందని, దీంతో తాను అక్కడికి వెళ్ళానని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి లక్నో వెళ్ళినట్లు తెలిపాడు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని తెలియడంతో తామే వచ్చి లొంగిపోయినట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు స్వప్నని పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు తాను సిద్ధంగానే ఉన్నట్లు తెలిపాడు. అలీఘర్ లోని దావోస్ కి చెందిన స్వప్న, జితేంద్ర కుమార్ భార్యాభర్తలు. వీరికి శివాని అనే ఓ కూతురు ఉంది. ఆమెకు పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు రాహుల్ కుమార్ అనే యువకుడితో శివానికి పెళ్లి నిశ్చయించారు. మరో పది రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా ఏప్రిల్ 6, 2025 న 40 ఏళ్ల స్వప్న తనకు కాబోయే అల్లుడు రాహుల్ కుమార్ తో పరారీ అయింది. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

