వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
ద్విచక్ర వాహనాలు దొంగిలించే దొంగలు ఎవరైనా ఏ బైక్ దొరికితే ఆ బైక్ పట్టుకొని వెళ్ళిపోతారు. కానీ వీడు అదో టైప్. కేవలం ఒక్క కంపెనీకి చెందిన బైక్స్ మాత్రమే వీడి టార్గెట్. ఫుడ్ డెలివరీ బాయ్ లా నటిస్తూ ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని అమ్ముకొని జలుసాలు చేస్తూ ఉంటాడు. ఎట్టకేలకు వాడి బండారం బయటపడి పోలీసులకు చిక్కాడు. ఈ విచిత్ర దొంగను వరంగల్ కమిషనరేట్ పరిధిలోని హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగిలించిన వాహనాలను రికవరీ చేసి రిమాండ్ కు పంపారు.
జనగామ జిల్లా చిలుపూరు మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన చందులాల్ అనే యువకుడు హనుమకొండలోని గోపాలపురంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో తన స్నేహితుడి లాగిన్ ఐడీ తో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ సంస్థల్లో పనిచేస్తున్నాడు. జలుసాలకు అలవాటు పడిన ఈ యువకుడు బైక్స్ చోరీలకు ప్లాన్ వేశాడు. కేవలం స్ప్లెండర్, ఫ్యాషన్ ప్లస్ వాహనాలను మాత్రమే వీడు చోరీ చేశాడు. మిగతావి ఏవి వీడికి నచ్చవు. ఆ వాహనాలు ఎక్కడ కనబడితే అక్కడ మాయం చేసేవాడు. ఏడారాది వ్యవధిలో 18 బైకులు చోరీ చేశాడు. వాటిలో కొన్ని వాహనాలు తన ఇంట్లో దాచుకొని మరికొన్ని వాహనాలను తన ఖర్చుల కోసం తక్కువ ధరకు అమ్మేశాడు. వరంగల్, హైదరాబాద్, రాజకొండ పోలీస్ కమిషనరేట్లతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో కూడా ఇతనిపై చోరీ కేసులు నమోదయ్యాయి. చాకచక్యంగా పట్టుకున్న హసన్ పర్తి పోలీసులు ఇతన్ని చోరీల గుట్టుమట్టు రట్టు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
కదిలే రైళ్లో ఏటీఎం.. ట్రయల్ సక్సెస్ వీడియో
మగపిల్లల కోసం బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే ! వీడియో
ఇంటి పనుల కోసం రోబోను తెచ్చుకున్న ఫ్యామిలీ వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
