ఇంటి పనుల కోసం రోబోను తెచ్చుకున్న ఫ్యామిలీ వీడియో
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి వరకు నిమిషం తీరక లేక సతమతం అవుతున్న వారందరూ ఇక ఆలు మగాళ్ళు అయినా ఉద్యోగస్తులు అయితే వారి కష్టాల గురించి చెప్పుకోకపోవడమే ఉత్తమం. ఇంటి పని ఆఫీసు పని చేయలేక సతమతం అవుతూ ఉంటారు. పోనీ ఓ పని మనిషి పెట్టుకుందామా అంటే సరైన వారు దొరకరు. అన్ని కుదిరి వారు అడిగినంత డబ్బులిచ్చి పనిలో పెట్టుకున్న వారు తీరునచ్చక కొందరు చెప్పా పెట్టకుండా డమ్మా కొట్టడంతో మరికొందరు ఇబ్బందులు పడతారు. బెంగుళూరుకు చెందిన ఓ ఫ్యామిలి కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. కాస్త తెలివిగా ఆలోచించి ఆ సమస్య నుంచి గట్టెక్కింది. ఇంతకీ ఏంటి ఆ పరిష్కారం అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ.
ఉదయం లేచినప్పటి నుంచి పనులు చేసుకోలేక ఇబ్బందిపడే మహిళలు ఎందరో. బెంగుళూరుకు చెందిన చాలామంది మహిళలు కూడా ఆ కోవలోకే వస్తారు. ఇంట్లో పనులు చేసుకుంటూ ఆఫీసుకు వెళ్లి భర్త స్కూల్ కి వెళ్ళే పిల్లలకు పొద్దున్నే టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేయడం వారికి పెద్ద సవాలు. సాయంకాలం కోసం పని మనిషిని పెట్టుకున్నా టైంకి రాకపోవడం వారు వండి న వంటలు నచ్చకపోవడంతో ఇబ్బందులు పడేవారు ఎందరో. అయితే ఈ సమస్యకు కొందరు మహిళలు టెక్నాలజీతో చెప్పుకొచ్చారు. పని మనిషికి గుడ్ బై చెప్పి ఇంట్లో పనులు చేసేందుకు మరో మనిషిని తెచ్చుకుంటున్నారు. ఈ రోబో వంటింట్లో కూరగాయలు కట్ చేయడం నుంచి క్లీనింగ్ వరకు అన్ని పనులు చేసి పెడుతూ ఉండటంతో ఇప్పుడు వారంతా హాయిగా ఊరి పీల్చుకుంటున్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. వంట మనిషిగా మారి రోబోలు చేసే వంటలు కూడా అద్భుతంగా ఉన్నాయట. పూహా, పావ్ భాజి, రాజ్మా చావల్ ఇలా ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఆధారంగా ఈ మరమనిషి రకరకాల వంటకాలు సిద్ధం చేసి పెడుతుందట. మొబైల్ యాప్ ద్వారా గైడ్ చేస్తే చాలు ఈ రోబో తన పని తాను చేసుకుపోతుంది. కూరలు మాత్రమే కాదు ఫ్రైలు స్టీమింగ్ చేయడంలోను ఇది ఎక్స్పర్ట్ అట. ఈ రోబో కుక్ దర 40 వేలు. అయితే ఈ పనిమనిషికి నెలనెలా చెల్లించే మొత్తంతో పోల్చుకుంటే ఈ వన్ టైం ఇన్వెస్ట్ మెంట్ చాలా బెటర్ అని మహిళలు అంటున్నారు. రోబోలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో చాలావరకు స్టార్టప్ వంటి పనులు చేసే మరో మనిషిని రూపొందించేందుకు మొగ్గు చూపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అమెరికాలో దారుణం.. తల్లిదండ్రులను కాల్చి చంపిన కొడుకు..ఎందుకంటే వీడియో
ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. మీ కొంప కొల్లేరే వీడియో
సీఈవో కుటుంబాన్ని నట్టేట ముంచిన నట్టు.. వీడియో

300 కార్లు.. 38 విమానాలు.. ఇది కదా రాయల్ లైఫ్ అంటే వీడియో

25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు

51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు

పవన్ ఎఫెక్ట్.. రామ్ చరణ్, సుక్కు సినిమాకు బ్రేక్ వీడియో

ఆ వస్తువు కారణంగా.. విమానం ఎక్కకుండా ఆపిన సిబ్బంది వీడియో

అగ్నిపర్వతం బద్ధలు..విమానాలు క్యాన్సిల్ వీడియో

కాసేపట్లో అక్క పెళ్లి ఇంతలోనే ఆక్సిడెంట్లో తమ్ముడు వీడియో
