కదిలే రైళ్లో ఏటీఎం.. ట్రయల్ సక్సెస్ వీడియో
ఏటీఎంలు రాకముందు క్యాష్ కోసం బ్యాంకుల ముందు క్యూ లైన్లో పడిగాపులు కాశే వాళ్ళం. గంటల కొద్దీ నిలచోవాల్సిన పరిస్థితి. కానీ ఏటీఎం ఎంట్రీతో ఆ కష్టాలు తప్పాయి. మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లలో వీటిని ఏర్పాటు చేయడంతో సులభంగా క్యాష్ తీసుకుంటున్నాం. ఈ సౌకర్యం కదిలే రైళ్లలో కూడా అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ను మధ్య రైల్వే విజయవంతంగా పూర్తి చేసింది. 24 గంటలు సేవ చేస్తుంది. మన్మడ్, ముంబై మధ్య నడిచే పంచవటి ఎక్స్‌ప్రెస్ లో ఏటీఎం ఏర్పాటు చేసింది.
ట్రయల్ రన్ సఫలంగా జరిగిందని అధికారులు తెలిపారు. అయితే ఇగత్‌పురి, కసారా మధ్య ఉండే నెట్‌వర్క్ లేని ప్రాంతంలో ముఖ్యంగా సొరంగాల వల్ల కొన్నిసార్లు సిగ్నల్ పోవడం మాత్రమే ఒక చిన్న సమస్య అన్నారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు రైల్లో ఏటీఎం అందుబాటులోకి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఏసీ కోచ్‌లో దీన్ని ఏర్పాటు చేసినప్పటికీ రైళ్లలో 22 బోగీల్లోనూ అందరికీ కనిపించేలా అనుసంధానం చేశారు. ఈ ఏటీఎం సేవలు ప్రజాదరణ పొందితే ఇతర ముఖ్యమైన రైళ్లలో కూడా ఈ సదుపాయం విస్తరించే అవకాశం ఉంది. భద్రత పరంగా ఏటీఎం కియోస్క్ ను అవసరమైనప్పుడు మూసివేయొచ్చు. అలాగే 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటుంది. గుసావల్ డివిజన్ రైల్వే మేనేజర్ ఐటీ పాండే మాట్లాడుతూ ట్రయల్ రన్లో మంచి రిజల్ట్స్ వచ్చాయని ఇక ప్రయాణికులు కదులుతున్న రైల్లో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఏటీఎం పనితీరును నిరంతరం పరిశీలిస్తూనే ఉంటామని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం :
అమెరికాలో దారుణం.. తల్లిదండ్రులను కాల్చి చంపిన కొడుకు..ఎందుకంటే వీడియో
ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. మీ కొంప కొల్లేరే వీడియో
సీఈవో కుటుంబాన్ని నట్టేట ముంచిన నట్టు.. వీడియో
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
