మగపిల్లల కోసం బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే ! వీడియో
పిల్లల పెంపకం వారి భవిష్యత్తు విషయంలో విదేశాలకు మన దేశానికి చాలా తేడా ఉంది. ఫారెన్ కంట్రీస్ లో ఒక ఏజ్ వచ్చాక పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తే మన దగ్గర మాత్రం వారి లైఫ్ లో సెటిల్ అయ్యే వరకు పేరెంట్స్ వెన్నంటే ఉంటారు. నిజానికి భారత్ లో పిల్లలు పుట్టక ముందు నుంచే భార్యాభర్తలు వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా పిల్లల కోసం పొదుపు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. అమ్మాయిల కోసం తెచ్చిన సుకన్య సమృద్ధి యోజన మోస్ట్ పాపులర్ స్కీమ్.
కానీ మగపిల్లల కోసం ఎలాంటి పొదుపు పథకాలు ఉన్నాయి. వారి ఫ్యూచర్ కోసం ఎలాంటి స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆడపిల్లల్లాగే మగపిల్లల కోసం కూడా కేంద్రం చాలా పథకాలు అందుబాటులోకి తెచ్చింది. అయితే వాటి గురించి చాలా మందికి తెలియదు. అబ్బాయిల కోసం తెచ్చిన పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ రికరింగ్ డిపాజిట్ ఇలా చాలా ఉన్నాయి. వీటిల్లోనే నెలనెల ఇన్వెస్ట్ చేయడంతో పాటు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి మంత్లీ ఇన్కమ్ గా కూడా పొందవచ్చు. 1988 లో కేంద్రం పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తీసుకొచ్చింది. తక్కువ ఆదాయ వర్గాలకు ఇదో మంచి ఆప్షన్. ఇది మగపిల్లలకు ఉపయోగపడే స్వల్పకాలిక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకంలో ఏటా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. 18 ఏళ్ల వయసు వారెవరైనా ఈ స్కీమ్ కు అర్హులు. 18 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు తరపున తల్లిదండ్రులు సంరక్షకులు దరఖాస్తు చేసుకోవచ్చు. మినిమం ₹1000 నుంచి ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. మెచ్యూరిటీ టెన్యూర్ 10న్నర నాలుగు నెలలు.
మరిన్ని వీడియోల కోసం :
అమెరికాలో దారుణం.. తల్లిదండ్రులను కాల్చి చంపిన కొడుకు..ఎందుకంటే వీడియో
ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. మీ కొంప కొల్లేరే వీడియో
సీఈవో కుటుంబాన్ని నట్టేట ముంచిన నట్టు.. వీడియో
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
