మన డబ్బులు భద్రమేనా.. మే1నుంచి కనిపించని బ్యాంకులు!
బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మే ఒకటి నుంచి దేశంలో ఆ బ్యాంకులు కనిపించవు. వాటి పేర్లు కూడా వినిపించవు. దేశవ్యాప్తంగా మరో పెద్ద ఎత్తున బ్యాంకుల విలీనం కి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ఈసారి గ్రామీణ బ్యాంకులను విలీనం చేయనుంది. ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మరి ఏ బ్యాంకులు విలీనం కానున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది? వీటిలో ఖాతా ఉన్నవారి పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం మరోసారి బ్యాంకుల విలీనం కి తెరలేపింది.
అయితే ఈసారి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తుంది. ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంకు అనే నినాదంతో ఈ విలీన ప్రక్రియ చేయబడుతుంది. బ్యాంకుల విలీనంతో పలు బ్యాంకులు ఇకపై కనిపించకపోవచ్చు. మరి విలీన బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న ఖాతాదారుల పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి? ఏ బ్యాంకులో ఏది విలీనం అయ్యే అవకాశం ఉంది? ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నాలుగో దశ విలీన ప్రక్రియను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటికే నాబార్డ్ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిగి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దేశంలో 43 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో మొత్తంగా 15 బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేయునుంది. అంటే ఆ బ్యాంకులు ఇకపై కనిపించవు. దీంతో గ్రామీణ బ్యాంకుల సంఖ్య 28 కి తగ్గుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు, యూపీ, బెంగాల్ రాష్ట్రాల్లో మూడు చొప్పున బ్యాంకులు విలీనమవుతాయి. అనగా బీహార్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో రెండు చొప్పున విలీనమవుతున్నాయి. ఈ విలీనం ద్వారా బ్యాంకుల పనితీరు మెరుగుపడుతుందని కేంద్రం చెబుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
కదిలే రైళ్లో ఏటీఎం.. ట్రయల్ సక్సెస్ వీడియో
మగపిల్లల కోసం బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే ! వీడియో
ఇంటి పనుల కోసం రోబోను తెచ్చుకున్న ఫ్యామిలీ వీడియో
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
