యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
జుగాడ్లు తయారు చేయడంలో భారతీయులను మించిన వారు ఉండరూ అనడంలో అతిశయోక్తి లేదు. పనికిరావని పడేసే వస్తువులను కూడా అద్భుతంగా రీయూజ్ చేస్తూ ఉంటారు. వీరి తెలివితేటలకు నిజంగా హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఓ యువకుడు చేసిన జుగాడ్ నెటిజన్లను కట్టిపడేస్తుంది. ఓ టేబుల్ ఫ్యాన్ ను అద్భుతమైన ఏసీగా మార్చేశాడు. అది చూసి నెటిజన్లు ఏం ఐడియా గురు దీని ముందు ఏసీలు కూడా దిగదుడుపు అంటున్నారు.
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఏసీ కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందరూ ఏసీలు కొనలేరు కదా. అలాంటప్పుడే ఇలాంటి ఐడియాలు వస్తూ ఉంటాయి. అవసరాల్లోంచి పుట్టే ఆలోచనలే అద్భుతాలను సృష్టిస్తాయి. అలా ఓ యువకుడు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందటానికి తన ఇంట్లో ఉన్న టేబుల్ ఫ్యాన్ ను ఏసీగా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. టేబుల్ ఫ్యాన్ ని తీసుకొచ్చి దాని వెనుక ఉన్న కవర్ ని తీసేశాడు. ఓ వాటర్ బాటిల్ తీసుకొని దానిని బ్యాక్ సైడ్ కట్ చేశాడు. ఇప్పుడు అది వాటర్ ను డబ్బాల్లో నింపుకోవడానికి వాడుకునే గల్లాలాగా తయారైంది. దీనిని ఫ్యాన్ వెనుక కవర్ తీసేసిన చోట అమర్చాడు. దీనికి ఓ పైప్ జాయింట్ చేశాడు. అలాగే ఫ్యాన్ ముందు భాగంలో కూడా ఇదే మాదిరిగా ఓ పైప్ అమర్చాడు. ఆ తర్వాత ఒక థర్మోకోల్ బాక్స్ తీసుకొని దానిని ఐస్ ముక్కలతో నింపాడు. ఇప్పుడు వాటర్ బాటిల్ కి అమర్చిన రెండు పైపులను ఐస్ ముక్కలు వేసిన బాక్స్ కి జాయింట్ చేశాడు. ఇప్పుడు మామూలుగానే ఫ్యాన్ ఆన్ చేశాడు. ఐస్ బాక్స్ లోని చల్లదనం మొత్తం ఫ్యాన్ గుండా బయటికి రావడంతో చల్ల చల్లని కూల్ కూల్ అంటూ ఏసీని మించిన చల్లగాలితో హాయిగా షేడ్ తీరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటి వరకు తొమ్మిది మిలియన్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. రెండు లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ యువకుడి వినూతన ప్రయోగం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. టేబుల్ ఫ్యాన్ తో ఏసీ ఎఫెక్ట్ అదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
కదిలే రైళ్లో ఏటీఎం.. ట్రయల్ సక్సెస్ వీడియో
మగపిల్లల కోసం బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే ! వీడియో
ఇంటి పనుల కోసం రోబోను తెచ్చుకున్న ఫ్యామిలీ వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
