సూపర్ బైక్.. ఒకసారి ట్రై చేయండి అస్సలు వదలరు వీడియో
చాలా మందికి కొత్త కొత్త బైకులు నడపడం అంటే ఇష్టపడతారు. మార్కెట్లో వచ్చే ఏ మోడల్ బైక్ అయినా నడిపి తీరాల్సిందే. కొందరికి ఇలాంటి ఆసక్తి ఉన్నా వాటిని కొనుగోలు చేయలేక వారే రకరకాల వింత వాహనాలను తయారు చేసుకుని నడుపుతుంటారు. అలాంటి జుగాడ్లు మనం నిత్యం చాలానే చూశాం. భారతదేశంలో ఇలాంటి జుగాడ్లు తయారు చేసే వారు చాలామందే ఉన్నారు. అయితే వీళ్ళ ఐడియా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఓ యువకుడు తయారు చేసిన ఈ బైక్ చూస్తే మీరు అదే అంటారు. ప్రస్తుతం ఓ వినూత్న బైక్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతని ఐడియాకి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఎలా వస్తాయి బాస్ ఇలాంటి ఐడియా అంటున్నారు. పూర్వం కరెంటు పోగానే జనరేటర్ ఆన్ చేసే వాళ్ళు గుర్తుందా?
సినిమా హాల్లో సినిమా మధ్యలో కరెంటు పోతే థియేటర్లో వాళ్ళు జనరేటర్ ఆన్ చేసేవరకు గోల గోల చేసే వాళ్ళు ప్రేక్షకులు. గుర్తొచ్చిందా? మనోడి మెయిన్ ఇన్‌స్ట్రుమెంట్ అదే. ఈ పాత జనరేటర్ని ఉపయోగించి అద్భుతమైన బైక్ తయారుచేశాడు. ఇందుకోసం ట్రాక్టర్ ముందు భాగంలో ఉండే రెండు టైర్లను తీసుకున్నాడు. అలాగే బైక్కు కావలసిన హ్యాండిల్, లైట్లు, సీటుతో సహా మిగతా విడి భాగాలన్నింటిని ఏర్పాటు చేసుకున్నాడు. అన్నిటినీ చక్కగా ఫిట్ చేశాడు. బైక్ చక్రాల స్థానంలో ట్రాక్టర్ టైర్లను అమర్చి మధ్యలో జనరేటర్ ఫిట్ చేశాడు. అలా ఒక సూపర్ బైక్ను తయారు చేశాడు. తన ప్రయోగాన్ని చెక్ చేద్దామని ట్రయల్ రన్ కి సిద్ధమయ్యాడు. జనరేటర్ను ఇంపా హ్యాండిల్ సాయంతో గిరగిరా తిప్పి స్టార్ట్ చేశాడు. బైక్ కూడా స్టార్ట్ అయింది. ఇంకేముంది తన కొత్త బైక్ తో రోడ్డుపై రైడ్ ని దూసుకుపోయాడు. అయితే ఈ వింత బైక్ చేసే విచిత్ర శబ్దాలకు రోడ్డుపై వెళ్లేవాళ్ళు ఓ రణాయనో ఇదేం బైక్ రా స్వామి అంటూ చెవులుమూసుకుని చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నిత్యం ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే వేలాది మంది వీక్షించారు. వందలలో లైక్ చేస్తున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
కదిలే రైళ్లో ఏటీఎం.. ట్రయల్ సక్సెస్ వీడియో
మగపిల్లల కోసం బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే ! వీడియో
ఇంటి పనుల కోసం రోబోను తెచ్చుకున్న ఫ్యామిలీ వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
