AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. మ్యాజిక్ లాగా పనిచేస్తుంది!

పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. మ్యాజిక్ లాగా పనిచేస్తుంది!

Phani CH
|

Updated on: Apr 23, 2025 | 7:31 PM

Share

ఈ మధ్య కాలంలో చాలా మంది బీ 12 విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్‌ బి-12 రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని.. ఇది లోపిస్తే మెగా లోబ్లాస్టిక్‌ అనీమియాకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

బలహీనత, అలసట, తలతిరగడం, జ్ఞాపకశక్తి సమస్యలు వంటి లక్షణాలు B12 లోపించిన వారిలో కనిపిస్తాయి. దీనిని అధిగమించేందుకు సహజ మార్గాన్ని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్ బి12 అనేది ఒక పవర్‌హౌస్ పోషకం అని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన నరాలు, మెదడు పనితీరు ఇంకా ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇది చాలా అవసరం. ఎక్కువగా విటమిన్‌ బి12 లోపం ఎక్కువగా శాఖాహారులలో సర్వసాధారణంగా మారుతోంది. దీనిని అధిగమించడానికి ఖరీదైన సప్లిమెంట్లు తీసుకోనవసరం లేదంటున్నారు నిపుణులు. పెరుగు, ఉసిరి ఈ సమస్య నివారణకు బాగా ఉపయోగపడతాయంటున్నారు. ఒక కప్పు పెరుగులో ఓ టీస్పూన్‌ ఉసిరి పొడిని కలిపి రోజూ తీసుకుంటే సహజంగా శరీరంలో బి12 స్థాయిలు అద్భుతంగా పెరుగుతాయని చెబుతున్నారు. అయితే ఇది క్రమం తప్పకుండా కొన్ని వారాలపాటు తీసుకోవాలి. 100 గ్రాముల పెరుగులో దాదాపు 0.5 మైక్రోగ్రామ్‌ B12 ఉంటుంది. శాఖాహారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలర్ట్‌.. వాట్సప్‌లో వచ్చే ఫోటోలు ఓపెన్‌ చేస్తే.. అంతే..

గ్రహాంతరవాసుల దాడి? రాయిలా మారిన సోవియట్ సైనికులు

అనంత్ అంబానీ బరువుకు కారణమేంటి..? కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్నా ఎందుకు తగ్గడం లేదు

విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించిన సీన్‌ చూసి

చాట్జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే