చాట్జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే
కాలిక్యులేటర్ వచ్చాక లెక్కలు చేయటం ఈజీ అయింది. కానీ మనిషి సొంతంగా పెద్ద లెక్కలు చేయటమే మరిచిపోయాడు. ల్యాండ్‌లైన్ ఉన్నప్పుడు కనీసం 10 ఫోన్ నంబర్లైనా గుర్తుండేవి. అదే మొబైల్ ఫోన్లు వచ్చాక కనీసం ఇంట్లో వారి నంబర్లు కూడా జ్ఞాపకం ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన ఏఐ చాట్ బాట్లు.. మనిషి ఆలోచన శక్తిని హరిస్తున్నాయి.
అంతేకాదు.. యూజర్ల డేటాను కలెక్ట్ చేసి వారి ఉనికిని ప్రమాదంలో పడేస్తున్నాయి. ఇంతకీ ఈ ఏఐ ప్రభంజనం ఎక్కడికి దారితీస్తోంది. ఏఐ చాట్ బాట్లను గుడ్డిగా నమ్మితే ఏం జరుగుతుంది.? టెక్నాలజీ.. రెండువైపులా పదునున్న కత్తి. దాన్ని సక్రమంగా వాడితే.. అంతా బాగానే ఉంటుంది. కానీ దానికి బానిసైతే.. జీవితాలే ఆగమవుతాయి. ఈ మధ్యకాలంలో ప్రతి విషయానికి టెక్నాలజీపై ఆధారపడటం కామనైపోయింది. ఇక ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రాకతో మనిషి జీవితమే కృత్రిమమైపోయింది. ఏఐ పుణ్యమాని మనిషి ఆలోచించడమే మానేశాడు. సోషల్ మీడియా రాకతో పక్కనున్న వారిని పట్టించుకోవడమే మానేసిన జనం.. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఎంట్రీతో ఇంకా ఒంటరైపోతున్నారు. అన్నింటికీ స్పందించే మిషన్ పక్కనే ఉండగా.. మనిషితో ఏం పని అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఓపెన్ ఏఐ కంపెనీ 2022 నవంబర్ 30న విడుదల చేసిన చాట్‌బాట్.. చాట్ జీపీటీ. ప్రపంచవ్యాప్తంగా ఇది ఓ తుఫాన్ సృష్టించింది. 5 రోజుల్లోనే 10 లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. ఈ ఫీట్ సాధించడానికి నెట్‌ఫ్లిక్స్ కు మూడున్నరేళ్లు, ట్విట్టర్‌కు రెండేళ్లు, ఫేస్‌బుక్ కు 10 నెలలు పట్టింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
Sri Satya: శ్రీసత్య ఓవర్ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

