విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించిన సీన్ చూసి
నిజమైన రక్షక భటులు అనిపించుకున్నారు కొందరు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు సహాయం చేసిన పోలీసులను అందరూ మెచ్చుకుంటున్నారు. కళ్లంలో ఆరబెట్టి రాశులు చేసి వర్షానికి తడవకుండా వాటిపై పట్టాలు కప్పారు. కానీ మంగళవారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
ఈదురు గాలులకు ధాన్యపు రాశులపై పట్టాలు ఎగిరిపోయాయి. ఈక్రమంలో ధాన్యాన్ని కాపాడుకోడానికి రైతులు పడుతున్న అవస్థలు అటుగా వెళ్తున్న కొందరు పోలీసుల కంటపడింది. వెంటనే వారు రంగంలోకి దిగి రైతులకు సహాయం చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. నల్గొండ జిల్లా హాలియా మండలం ఇబ్రహీంపేట స్టేజీ వద్ద ప్రధాన రోడ్డు వెంట రైతులు ధాన్యాన్ని ఎండబెట్టారు. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు రైతులు పట్టాలు కప్పుతున్నారు. అకాల వర్షం, ఈదురు గాలులకు ధాన్యపు రాశులపై కప్పిన పట్టాలు ఎగిరిపోయాయి. ఇదే సమయంలో నిడమనూరు మండలం బొక్క ముంతలపాడులో విధులు ముగించుకొని ఇబ్రహీంపట్నం స్టేజి మీదుగా నల్లగొండకు ప్రత్యేక పోలీసు దళం వెళ్తోంది. వర్షానికి తమ ధాన్యం కాపాడుకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను పోలీసులు గమనించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చాట్జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
Sri Satya: శ్రీసత్య ఓవర్ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

