రేపు ఆకాశంలో అద్భుతం.. మిస్ కాకుండా చూడండి వీడియో
ఏప్రిల్ 25వ తేదీ తెల్లవారుజాముకు ముందు శుక్రుడు, శని నెలవంకకు అతి సమీపంలోకి రానున్నాయి. ఒక దగ్గరే కనిపించనున్న ఆ మూడు స్మైలీ ఫేస్ ఆకృతిని ప్రతిబింబించనున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉంటే సూర్యోదయానికి ముందు అతి కొద్ది సమయం మాత్రమే కనిపించనున్న ఈ దృశ్యాన్ని ప్రపంచంలో ఎక్కడినుంచైనా వీక్షించేందుకు అవకాశం ఉంది.
తూర్పు దిశగా భూమి, సముద్రం ఒక రేఖ వద్ద ఆకాశంతో కలుస్తున్నట్టుగా ఉన్న దగ్గర దీన్ని చూడవచ్చు. ఆ గీతకు ఎగువన శుక్రుడు, కిందివైపు శని ఇంకా కిందికి నెలవంక ఒక దగ్గరకు రానున్నాయి. ఈ రెండు గ్రహాలు నయనాలై నెలవంక చిరునవ్వుతో ఉన్న పెదాలాగా కనిపించనుంది. ఈ వివరాలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సోలార్ సిస్టమ్ అంబాసిడర్ బ్రాండ్ కాల్బెర్ట్‌సన్ వెల్లడించారు. శుక్రుడు, శని ప్రకాశవంతంగా ఉండటంతో వాటిని మామూలుగా వీక్షించవచ్చు. అయితే స్మైల్ ఇమేజ్‌ను చూసేందుకు మాత్రం స్టార్ గాజింగ్ బైనోక్యులర్ టెలిస్కోప్ అవసరమవుతాయని చెప్పారు. ఆకాశంలో ఎలాంటి మేఘాలు లేకపోతే అదే సమయంలో ఈ మూడింటి కింద బుధుడిని కూడా చూడొచ్చని ఓ మీడియా కథనం పేర్కొంది.
మరిన్ని వార్తల కోసం :
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో
యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
