Jayam Child Artist: ఈ అమ్మాయేంట్రా సామి.. ఇట్టా మారిపోయింది.. జయం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్‌ను ఇప్పుడు చూస్తే..
ఒకప్పుడు సినిమాల్లో చైల్ట్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. కానీ కొందరు మాత్రం సినిమాలకు దూరంగా ఉండిపోయారు. అందులో ఈ అమ్మాయి ఒకరు. జయం సినిమాతో తెలుగులో మంచి పాపులారిటి తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత అంతగా చిత్రాల్లో నటించలేదు. ఇంతకీ ఇప్పుడేం చేస్తుందో తెలుసుకుందామా..

ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న యువ హీరోహీరోయిన్స్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టి్స్టులుగా నటించినవారే. చిన్నప్పుడు అమాయకత్వం.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. వరుస చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా వెండితెరపై సత్తా చాటుతున్నారు. అలాగే అప్పట్లో బాలనటీనటులుగా కనిపించిన చిన్నారులు ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరమయ్యారు. ఇప్పటికీ ఇండస్ట్రీకి దూరంగానే ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అందులో ఈ అమ్మడు ఒకరు. టాలీవుడ్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అంతకు ముందు బుల్లితెరపై పది సీరియల్స్ చేసింది. సీతామహాలక్ష్మి అనే సీరియల్ చేస్తున్న సమయంలోనే జయం మూవీ ఆడిషన్స్ కోసం ప్రకటన రావడంతో ఆమె తండ్రి తన ఫోటోలను దర్శకుడికి పంపించారు. అలా హీరోయిన్ చెల్లి పాత్ర కోసం సెలక్ట్ అయ్యింది. ఇంతకీ ఈ అమ్మాయి పేరెంటో గుర్తుందా.. ? తన పేరు శ్వేత. జయం సినిమాతోపాటు ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు వంటి చిత్రాల్లో నటించి ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది.
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన జయం సినిమాలో నితిన్, సదా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాలో హీరోయిన్ దా చెల్లి పాత్రలో నటించి మెప్పించింది శ్వేత. ముఖ్యంగా అక్షరాలను తిప్పిరాసే అమ్మాయిగా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తన నటనతో ఈ పాత్రకు నంది అవార్డ్ గెలుచుకుంది. శ్వేత తల్లి జయలక్ష్మి సీరియల్ ఆర్టిస్ట్. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది శ్వేత. కానీ ఇండస్ట్రీలో హీరోయిన్ కాలేకపోయింది.
జయం తర్వాత ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు వంటి చిత్రాల్లో నటించిన తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. విదేశాల్లో మాస్టర్స్ కంప్లీట్ చేసి అక్కడే ఉద్యోగం చేసింది. ఇక పెళ్లి తర్వాత విదేశాల్లో సెటిల్ అయిన శ్వేతకు ఆఫర్స్ వచ్చినప్పటికీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన గ్లామరస్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..
