AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhubala: సినిమాల్లోకి హీరోయిన్ మధు బాల కుమార్తెలు! అందంలో అమ్మను మించిపోయారుగా.. లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో

మణిరత్నం తెరకెక్కించిన రోజా సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులోనూ మరీ ముఖ్యంగా హీరోయిన్ గా నటించిన మధు బాలకు ఇప్పటికీ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆమె ఇద్దరు కూతుర్లు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

Madhubala: సినిమాల్లోకి హీరోయిన్ మధు బాల కుమార్తెలు! అందంలో అమ్మను మించిపోయారుగా.. లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
Madhubala
Basha Shek
|

Updated on: Apr 24, 2025 | 11:42 AM

Share

‘పరువం వానగా నేడు కురిసిందిలే’ అనే పాట వినగానే మన కళ్ల ముందు ఒక అందమైన రూపం మెదులుతుంది. తనే హీరోయిన్ మధు బాల. అందం అంతకు మించిన అభినయంతో 90వ దశకంలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ ముద్దుగుమ్మ. మరీ ముఖ్యంగా మణి రత్నం రోజా సినిమాతో అప్పటి యూత్ కలల రాకుమారిగా మారిపోయింది. తెలుగుతో పాటు హిందీ , తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోసినిమాలు చేసి మెప్పించింది మధు బాల. తెలుగులో అల్లరి ప్రియుడు, ఆవేశం, గణష్, చిలక్కొట్టుడు, జెంటిల్మెన్ తదితర సినిమాల్లో యాక్ట్ చేసి ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైంది. కాగా సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే మధు బాల వివాహం చేసుకుంది. బాలీవుడ్ నటీమణులు హేమా మాలిని, జుహీ చావ్లాలకు దగ్గరి బంధువు అయిన వ్యాపార వేత్త ఆనంద్ షాను 1999 ఫిబ్రవరి 19న మ్యారేజ్ చేసుకుందీ అందాల తార. ఈ దంపతులకు అమెయా, కెయా అనే ఇద్దరు అందమైన కుమార్తెలు ఉన్నారు.

పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలకు క్రమంగా దూరమైంది మధు బాల. అయితే మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మరీ హీరోయిన్ రేంజులో వరుసగా సినిమాలు చేయకపోయినా సపోర్టింగ్ రోల్స్ తో ఆకట్టుకుంది. అంతకు మందు ఆ తర్వాత, సూర్య వర్సెస్ సూర్య, ప్రేమ దేశం, ఈగల్, శాకుంతలం తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది మధు బాల. ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనుందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

తన ఇద్దరు కూతుళ్లతో రోజా హీరోయిన్ మధు బాల..

కాగా మధుబాలకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు కియా షా, అమేయ షా. ఇద్దరూ తల్లి లాగానే చాలా అందంగా, అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా ఇద్దరు కూతుర్లలో కియా షా త్వరలో సినిమాల్లోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది.  దీనిపై ఇప్పటికే వర్క్ జరగనుందని సమాచారం.  త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.

గ్లామరస్ లుక్ లో మధు బాల ఇద్దరు కుమార్తెలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అల్ ఇన్ వన్ కారం పొడి.. టిఫిన్స్ ,అన్నం లోకి సూపర్ గా ఉంటది
అల్ ఇన్ వన్ కారం పొడి.. టిఫిన్స్ ,అన్నం లోకి సూపర్ గా ఉంటది
మీ బ్రెయిన్ పవర్ హఠాత్తుగా తగ్గిపోతోందా?.. ఇదే కారణం
మీ బ్రెయిన్ పవర్ హఠాత్తుగా తగ్గిపోతోందా?.. ఇదే కారణం
అంబానీ మనవడు ఏ స్కూల్‌లో చదువుతున్నాడో తెలుసా? ఫీజు ఎంతో తెలిస్తే
అంబానీ మనవడు ఏ స్కూల్‌లో చదువుతున్నాడో తెలుసా? ఫీజు ఎంతో తెలిస్తే
సొరకాయ వీరికి యమ డేంజర్.. తింటే ఆరోగ్యం పని అయిపోయినట్లే..
సొరకాయ వీరికి యమ డేంజర్.. తింటే ఆరోగ్యం పని అయిపోయినట్లే..
ఇడ్లీ, దోసలను మరిపించే రాగి పిండి ఉప్మా..
ఇడ్లీ, దోసలను మరిపించే రాగి పిండి ఉప్మా..
మల్లన్న భక్తులకు రైల్వే వరం.. అందుబాటులోకి కొమురవెల్లి స్టేషన్!
మల్లన్న భక్తులకు రైల్వే వరం.. అందుబాటులోకి కొమురవెల్లి స్టేషన్!
15 రోజుల్లో జుట్టు రాలడం ఆపేసే మేజిక్ స్మూతీ..
15 రోజుల్లో జుట్టు రాలడం ఆపేసే మేజిక్ స్మూతీ..
ఆల్‌టైమ్ రికార్డ్ ధరతో పోలిస్తే వెండి రూ.2 లక్షలు తక్కువ!
ఆల్‌టైమ్ రికార్డ్ ధరతో పోలిస్తే వెండి రూ.2 లక్షలు తక్కువ!
కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌!
కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌!
చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?