AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: దిమ్మతిరిగే ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్స్.. గుండెల్లో భయం పుట్టించే హారర్ సినిమా..

థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి వచ్చేసింది హీరోయిన్ హాన్సిక నటించిన హారర్ డ్రామా. ఎలాంటి ప్రచారం లేకుండానే సడెన్ గా ఓటీటీ అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో హాన్సిక ద్విపాత్రాభినయం చేసింది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ?

OTT Movie: దిమ్మతిరిగే ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్స్.. గుండెల్లో భయం పుట్టించే హారర్ సినిమా..
Hansika
Rajitha Chanti
|

Updated on: Apr 24, 2025 | 11:12 AM

Share

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హాన్సిక. తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సినిమాల్లో మెరిసింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. పెళ్లి తర్వాత సైతం సినిమాల్లో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్, మూవీస్ చేస్తుంది. ఇక గతేడాది హన్సిక ప్రధాన పాత్రలో నటించిన హారర్ డ్రామా గార్డియన్. ఫిల్మ్ వర్క్స్ బ్యానర్ పై విజయ్ చందర్ నిర్మించిన ఈ మూవీకి దర్శక ద్వయం శబరి, గురుశరవణన్ దర్శకత్వం వహించారు. తమళంలో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది.

ఈ సినిమాలో సురేష్ చంద్రమీనన్, శ్రీమాన్ కీలకపాత్రలలో నటించారు. హారర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పా్న్స్ వచ్చాయి. హాన్సిక నటించిన ఈ హారర్ డ్రామా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత హాన్సిక మరో సినిమా చేయలేదు. తెలుగులో చివరగా 105 మినట్స్ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం నషా పేరుతో తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. అలాగే పలు టీవీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది.

కథ విషయానికి వస్తే.. రోటిన్ హారర్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకును అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో అపర్ణ అనే ఇంటీరియర్ డిజైనర్ పాత్రలో నటించింది హన్సిక. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సహయంతో సిటీలోని పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నవారిపై ఆత్మ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది ? అసలు ఆ ఆత్మ ఎవరు? అనేది సినిమా.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..