OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సూపర్ హిట్ .. విక్రమ్, ఎస్‌జే సూర్యల యాక్టింగ్ కోసమైనా చూడాల్సిందే
తంగలాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా వీర ధీర శూర. .అరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఎస్ జే సూర్య మరో కీలక పాత్రలో అదరగొట్టాడు. దుషారా విజయన్ హీరోయిన్ గా నటించింది.

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’. తెలుగులో వీర ధీర శూర పేరుతో రిలీజైంది. మార్చి27న తమిళంతో పాటు తెలుగులోనూ ఒక సారి ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. తెలుగులో యావరేజ్ గా నిలిచినా తమిళ్ లో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. భారీ కలెక్షన్లు రాబట్టాయి. విక్రమ్, ఎస్ జే సూర్యల నటన, మాస్ ఆడియెన్స్ ను మెప్పించే యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో వీర ధీర శూర సినిమాకు బాగానే వసూళ్లు వచ్చాయి. ఎస్.యు.అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. వీర ధీర శూర మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇది వరకే స్ట్రీమింగ్ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేసింది. అందుకు తగ్గట్టుగానే గురువారం (ఏప్రిల్ 24) అర్ధ రాత్రి నుంచే విక్రమ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్న, హిందీ, మలయాళ భాషల్లో వీర ధీర శూర సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కాగా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం.
హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై రియా శిబు, శిబు తమీన్స్ వీర ధీర శూర సినిమాను నిర్మించారు. సూరజ్ వెంజర మూడు, పృథ్వీ, మాల పార్వతి, శ్రీజ రవి, కలైయరసన్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మరి థియేటర్లలో వీర ధీర శూర సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. మరీ ముఖ్యంగా విక్రమ్, ఎస్ జే సూర్యల యాక్టింగ్ కోసమైనా ఈ మూవీపై ఓ లుక్కేసుకోవచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..
From redemption to revenge, one night changes everything 🔥#VeeraDheeraSooranOnPrime, Watch Now: https://t.co/eeUJb9rSjD pic.twitter.com/X2nZaoDOJG
— prime video IN (@PrimeVideoIN) April 23, 2025
మోహన్ లాల్ ఎంపురాన్ కూడా వచ్చేసింది..
1) Veera Dheera Sooran (2025)
Now Streaming #amazonprimevideo
In Multi Language #Tamil , #Telugu , #malayalam , #Kannada, #Hindi
2) L2:எம்பிரான் (2025)
Now Streaming #JioHotstar In Multi Language #Tamil ,#malayalam , #Telugu ,#Kannada
TG 🔗 BIO ✅👆#VeeraDheeraSooran pic.twitter.com/VNyK3dCLfO
— Cinema & Webseries (@Sathish_dsv) April 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








