Urvashi Rautela: భలే వింత కోరిక కోరిన బాలయ్య హీరోయిన్..
సాధారణంగా ఫిలిం స్టార్స్ తమకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలని కోరుకుంటారు. ఇంకాస్త పెద్ద స్టార్ అయితే ఫ్యాన్స్ అసోషియేషన్స్ ఉంటే బాగుండని భావిస్తారు. ఇంకా పెద్ద స్టార్ అయితే తన మాట కోసం లక్షలాది కలిది వచ్చేంత స్టార్ డమ్ కోరుకుంటారు. కానీ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ మాత్రం వీటన్నింటికీ మించి కోరుకుంటున్నారు. ఇంతకీ ఈ బ్యూటీకి కావాల్సిందేంటి?
Updated on: Apr 24, 2025 | 7:17 PM

ఇన్నాళ్లు ఐటమ్ సాంగ్స్‌తో టాలీవుడ్ స్క్రీన్ మీద సందడి చేసిన ఊర్వశీ రౌతెలా, రీసెంట్‌గా డాకూ మహారాజ్ సినిమాలో బాలయ్యకు జోడీగా కనిపించారు. ఈ సినిమా తరువాత సౌత్ సర్కిల్స్‌లోనూ ఊర్వశికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

అందుకే ఈ బ్యూటీ చేసే కామంట్స్ ఇప్పుడు ఇక్కడ కూడా రచ్చ రచ్చ అవుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక వార్తతో న్యూస్ హెడ్‌లైన్స్‌లో ఫ్లాష్ అవుతుంటారు ఊర్వశీ.

దబిడి దబిడీ కాంట్రవర్సీ టైమ్‌లోనే సైఫ్ మీద దాడి గురించి మాట్లాడి చిక్కుల్లో పడ్డారు ఈ బ్యూటీ. తరువాత సారీ చెప్పి కూల్ చేసేశారు. ఇప్పుడు మరోసారి తన మార్క్ కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు.

తనకు ఉత్తరాఖండ్‌తో ఓ టెంపుల్ ఉందని, బద్రీనాథ్ టెంపుల్ పక్కనే తన ఆలయం ఉందన్నారు ఊర్వశీ. అంతేకాదు స్టూడెంట్స్ కూడా తనను దండమమాయి అని కొలుస్తున్నారని చెప్పారు. అక్కడితో అయిపోలేదు.

సౌత్‌లో కూడా తనకు అలాంటి టెంపుల్ ఒకటి ఉంటే బాగుంటదని కోరుకుంటున్నారు ఈ హాట్ బ్యూటీ. చిరు, పవన్, బాలయ్య లాంటి టాప్ హీరోలతో జోడీ కట్టిన తనకు ఓ గుడి ఉంటే బాగుండేది అంటున్నారు. మరి ఈ బ్యూటీ కోరికను ఎవరైన నెరవేరుస్తారేమో చూడాలి.




