రష్మికకు విచిత్రమైన అలవాటు.. మరీ ఉదయం 4 గంటలకేనా..
23 April 2025
Basha Shek
ప్రస్తుతం ఇండియాలోనే బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేరు ముందుంటుంది
గతేడాది పుష్ప2తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది ఛావా సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ చేతిలో పలు పాన్ ఇండియా ప్రాజెక్టులు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఉన్నాయి.
సాధారణంగా సెలబ్రిటీలు సన్నగా, నాజుకుగా మెరుపు తీగలా ఉండాలనుకుంటారు. ఇందు కోసం స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారు.
ఎంతగా తినాలనిపించినా సరే సినిమాల కోసం నోరు కట్టుకొని మరీ హెల్దీ డైట్ ఫాలో అవుతుంటారు. అయితే రష్మిక మాత్రం అలా కాదట.
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న రష్మిక మందన్న ఏకంగా ఉదయం 4 గంటలకే ఫుడ్ తింటుందట.
ఆ మధ్యన తెల్లవారుజామున 4 గంటలకు మ్యాగీని లాగిస్తున్న ఫోటోని షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చిందీ అందాల తార.
రాత్రి వేళళ్లో లాంగ్ నైట్ షూటింగ్ ఉన్నప్పుడు ఇలా స్నాక్స్ లాంటి ఫుడ్ తినడానికి బాగా ఇష్టపడుతుందట రష్మిక మందన్నా.
ఇక్కడ క్లిక్ చేయండి..