Kurnool: ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా
కర్నూలు జిల్లాలో నాగుపాము కలకలం రేపింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి లోని పిల్లల వార్డు లోకి వచ్చి ప్రజలను బెంబేలెత్తించింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓసారి లుక్కేయండి మరి..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం రేపింది. చిన్నపిల్లల వార్డులో ఒక్కసారి 6 అడుగుల ఉన్న నాగుపాము ప్రత్యక్షం కావడంతో అక్కడున్న రోగులందరూ భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. వెంటనే అక్కడ ఉన్న రోగుల బంధువులు ఆ పామును వెంటాడి, ముందుగా పిల్లల వార్డులో నుంచి బయటకు వచ్చేలా చేసి దానిని చంపడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆసుపత్రి ఆవరణ చుట్టూ అపరిశుభ్రంగా ఉండడంతో ఇలా విషపురుగులు నిత్యం వస్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం సమయంలో కాబట్టి పాము కనపడిందని.. రాత్రి సమయంలో అయితే చాలా ఇబ్బందికరంగా ఉండేదన్నారు. ఇప్పటికైనా వైద్య శాఖ అధికారులు స్పందించి ఆస్పత్రి ఆవరణ చుట్టూ శుభ్రంగా ఉండేలా చూడాలని రోగులు కోరారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

