AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CMRF నిధుల గోల్‌మాల్‌.. లక్షల రూపాయలు స్వాహా.. తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న అసలు నిజాలు

నిరుపేదలకు ఉచితంగా వైద్య చికిత్సను అందించడం కోసం ఆరోగ్య పథకాలతో పాటు.. ఇతర సదుపాయాలను కూడా కల్పిస్తున్నాయి. వాటిల్లో ఒక సీఎం రిలీఫ్ ఫండ్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిరుపేదలకు ఉచిత వైద్య చికిత్సను ఆరోగ్య శ్రీ ద్వారా అందిస్తున్నాయి. అయితే కొన్ని వ్యాధులకు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అవి ఆరోగ్య శ్రీ పరిధిలోకి రావు.. అప్పుడు అటువంటి వారికీ ఉపయోగపడే మరొక పథకం.. సీఎం రిలీఫ్ ఫండ్..

CMRF నిధుల గోల్‌మాల్‌.. లక్షల రూపాయలు స్వాహా.. తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న అసలు నిజాలు
Cmrf In Telangana
Surya Kala
|

Updated on: Apr 07, 2023 | 3:37 PM

Share

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. అందుకనే ఆరోగ్యానికి సంబంధించి అన్ని ప్రభుత్వాలు పెద్ద పీఠను వేస్తాయి. ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఆ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక పథకాలను, నిధులను ప్రవేశ పెట్టి అమలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా నిరుపేదలకు ఉచితంగా వైద్య చికిత్సను అందించడం కోసం ఆరోగ్య పథకాలతో పాటు.. ఇతర సదుపాయాలను కూడా కల్పిస్తున్నాయి. వాటిల్లో ఒక సీఎం రిలీఫ్ ఫండ్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిరుపేదలకు ఉచిత వైద్య చికిత్సను ఆరోగ్య శ్రీ ద్వారా అందిస్తున్నాయి. అయితే కొన్ని వ్యాధులకు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అవి ఆరోగ్య శ్రీ పరిధిలోకి రావు.. అప్పుడు అటువంటి వారికీ ఉపయోగపడే మరొక పథకం.. సీఎం రిలీఫ్ ఫండ్.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో CMRF మెడికల్‌ బిల్లుల గోల్‌మాల్‌ జరిగినట్లు వెల్లడైంది. నకిలీ బిల్లు సృష్టించి లక్షలు కొద్దీ డబ్బులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని రెండు ఆస్పత్రుల్లో బాధితులకు వైద్య చికిత్స అందించకుండానే.. చేయించినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు. అంతేకాదు కొందరు కేటుగాళ్లు ఆస్పత్రికి LOC ఇప్పించి డబ్బులు కాజేశారు. ఈ విషయం వెలుగుకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. CMRF నిధుల గోల్‌మాల్‌పై పోలీసుల విచారణ మొదలు పెట్టారు. ఆ రెండు ఆస్పత్రులతో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు.  వైద్యం చేయకపోయినా.. చేయించినట్టు నకిలీ బిల్లులు సృష్టించిన ఖమ్మంలోని వినాయక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు.. మిర్యాలగూడలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌పై కేసు నమోదు చేశారు. నల్గొండకు చెందిన జ్యోతి, లక్ష్మి, దిరావత్, శివపై కేసు నమోదు చేశారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం