AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భూ కబ్జాదారులపై సీపీ ఉక్కుపాదం.. తమ భూమి తమకు దక్కిందంటూ.. సీపీ చిత్రపటానికి రైతు దంపతులు పాలాభిషేకం

అక్రమాలకు పాల్పడితే ఎవరైనా ఒకటే అంటూ  నేరస్తుల పాలిట సింహస్వప్నమై బాధితులు గుండెల్లో దైవంలా నిలుస్తున్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. . భూ కబ్జాలకు పాల్పడితే వారు అధికార-ప్రతిపక్ష పార్టీ నాయకులా అన్న తేడా చూపించడం లేదు. 

Telangana: భూ కబ్జాదారులపై సీపీ ఉక్కుపాదం.. తమ భూమి తమకు దక్కిందంటూ..  సీపీ చిత్రపటానికి రైతు దంపతులు పాలాభిషేకం
Farmer Couple Doing Palabhishekam
Follow us
Surya Kala

|

Updated on: Mar 18, 2023 | 11:05 AM

భూకబ్జాదారులకు వరంగల్ సీపీ రంగనాథ్ పేరు వింటేనే వెన్నులో వణుకుపుడుతుంది.. అధికార పార్టీ నేతలని కూడా చూడకుండా అక్రమాలకు పాల్పడుతున్న వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. సీపీ రంగనాథ్ సిటీకి ఎంతోమంది పోలీస్ కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు.. అయితే కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో దైవంగా నిలిచిపోతారన్న మాటలను గుర్తు పెట్టుకున్నట్లున్నారు. అక్రమాలకు పాల్పడితే ఎవరైనా ఒకటే అంటూ  నేరస్తుల పాలిట సింహస్వప్నమై బాధితులు గుండెల్లో దైవంలా నిలుస్తున్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. . భూ కబ్జాలకు పాల్పడితే వారు అధికార-ప్రతిపక్ష పార్టీ నాయకులా అన్న తేడా చూపించడం లేదు.  భూ కబ్జాలకు పాల్పడితే మెడలుపట్టి కటకటాల్లోకి నెడుతున్నారు.. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ చర్యలతో కబ్జాదారుల చెరనుండి విముక్తిపొందిన దంపతులు సీపీ రంగనాథ్ చి త్రపఠానికి పాలాభిషేకం చేశారు.. తమ పాలిట దైవం అంటూ జేజేలు పలుకుతున్నారు.

వరంగల్‌ జిల్లాలోని నర్సంపేటకు చెందిన రైతు వీరాస్వామి, రాజ్యలక్ష్మి దంపతుల భూమిని కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగి మొరపెట్టుకున్నా రైతుకు న్యాయం జరగలేదు. ఐదేళ్లుగా తన భూమికోసం పోరాడుతూనే ఉన్నాడు వీరస్వామి. కాగా.. ఇటీవల భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్న వరంగల్‌ సీపీ రంగనాథ్‌ దృష్టికి తన సమస్యను తీసుకెళ్లారు వీరస్వామి దంపతులు. కబ్జాదారులనుంచి తమ భూమిని కాపాడమని వేడుకున్నారు. రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రంగనాథ్‌ 11 మంది భూ కబ్జాదారులను అదుపులోకి తీసుకొన్నారు. సీపీ రంగనాథ్‌ చొరవతో తమ భూమి తమకు దక్కిందని ఆనందం వ్యక్తం చేసిన ఆ రైతు దంపతులు సీపీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా..!
హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా..!
సోలార్‌తో ఏసీని నడపవచ్చా? ఎంత కెపాసిటీకి ఎన్ని ప్యానెల్స్‌ అవసరం
సోలార్‌తో ఏసీని నడపవచ్చా? ఎంత కెపాసిటీకి ఎన్ని ప్యానెల్స్‌ అవసరం
తక్కువ ధరలో సూపర్ స్మార్ట్ ఫీచర్లు ఈ స్మార్ట్‌వాచ్‌ల సొంతం
తక్కువ ధరలో సూపర్ స్మార్ట్ ఫీచర్లు ఈ స్మార్ట్‌వాచ్‌ల సొంతం
ఈ కుమారి కౌగిట నలిగిన ఆ చీరది ఏనాటి పుణ్యమో.. ఫ్యాబులస్ అనుక్రీతి
ఈ కుమారి కౌగిట నలిగిన ఆ చీరది ఏనాటి పుణ్యమో.. ఫ్యాబులస్ అనుక్రీతి
2064లో ఏం జరగనుంది? భయపెట్టిస్తోన్న కలియుగం సినిమా ట్రైలర్
2064లో ఏం జరగనుంది? భయపెట్టిస్తోన్న కలియుగం సినిమా ట్రైలర్
'క్యా ఆద్మీ హై!' ధోనికి ఫిదా అయిన బాలివుడ్ బ్యూటీ
'క్యా ఆద్మీ హై!' ధోనికి ఫిదా అయిన బాలివుడ్ బ్యూటీ
కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా సమర్థిస్తాంః రాహుల్
కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా సమర్థిస్తాంః రాహుల్
నిత్యం తాగొచ్చి తల్లిని కొడుతున్న తండ్రి.. కట్‌చేస్తే..
నిత్యం తాగొచ్చి తల్లిని కొడుతున్న తండ్రి.. కట్‌చేస్తే..
తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్.. వెంటనే కొని తెచ్చుకున్నాడు.. తర్వాత
తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్.. వెంటనే కొని తెచ్చుకున్నాడు.. తర్వాత
మీ జీమెయిల్‌పై హ్యాకర్ల దృష్టి.. యూజర్లకు గూగుల్ కీలక హెచ్చరిక..!
మీ జీమెయిల్‌పై హ్యాకర్ల దృష్టి.. యూజర్లకు గూగుల్ కీలక హెచ్చరిక..!