Telangana: జోరుగా భట్టి, రేవంత్ పాదయాత్రలు.. తగ్గేదేలే అంటూ బీఆర్ఎస్ నేతలపై సంచలన ఆరోపణలు..
తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్రల బాట పట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతల భట్టి విక్రమార్క పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్రల బాట పట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతల భట్టి విక్రమార్క పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా కాంగ్రెస్ కీలకనేతలు రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్నారు.
టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర నిజామాబాద్‌జిల్లా ఆర్మూర్ నియోకవర్గంలో కొనసాగింది. నందిపేట మండలం లక్కంపల్లి సెజ్‌ను సందర్శించిన రేవంత్, సాయంత్రం పెర్కిట్ నుంచి యాత్ర ప్రారంభించారు. మామిడిపల్లి, ఆర్మూర్ కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్‌కి పాదయాత్ర చేరుకుంది. ఆర్మూర్ పాత బస్టాండ్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వతీరుపై మండిపడ్డారు. మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి కేసీఆర్‌కు అమ్ముడుపోయారని విమర్శించారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఆయన సోదరుడు భూకబ్జాలకు హద్దే లేకుండా పోయిందని, ప్రజల రక్తం తాగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేకనిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కారు స్టీరింగ్ తన చేతిలో ఉందని చెప్పి MIM అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్‌కు ఓట్లు వేయించారన్నారు. ఐతే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రధాని మోదీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు.
భూమి లేని నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రైతులకు రైతు బంధులా.. నిరుపేదలకు భరోసా కల్పించేలా కాంగ్రెస్ ఆలోచన చేస్తుందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రెండో రోజు పాదయాత్ర కొనసాగుతుంది. రైతులు, ప్రజలతో మమేకమవుతూ పాదయాత్ర సాగిస్తున్నారు. భట్టి పాదయాత్రకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ జీవన్‌రెడ్డి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనుబంధంగా టీపీసీసీ హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టింది. రాహుల్ గాంధీ పాదయాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..