AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కడుపున పుట్టిన రాక్షసులు.. డబ్బులివ్వలేదని .. నిద్రపోతున్న తండ్రినే సజీవ దహనం చేసిన కూతుర్లు.. ఎక్కడంటే

కలికాలంలో కొడుకుల కంటే కూతుళ్లే నయం అంటారు తల్లిదండ్రులు..కానీ కామారెడ్డిలోని ఓ ముగ్గురు కూతుళ్లను చూస్తే.. ఈ మాటను వెనక్కు తీసుకోవాల్సిందే..ఎందుకంటే..వీళ్లు చాలా గొప్ప కూతుళ్లు..ఏ తండ్రికీ పుట్టని తనయలు..ఆ తండ్రి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో ఏమో కానీ..ఇంత గొప్ప కూతుళ్లు పుట్టారు. చివరకు ఆ కూతుళ్ల చేతిలోనే చితిపై కాలిపోయాడు..

Telangana: కడుపున పుట్టిన రాక్షసులు.. డబ్బులివ్వలేదని .. నిద్రపోతున్న తండ్రినే సజీవ దహనం చేసిన కూతుర్లు.. ఎక్కడంటే
Daughters Burned Father Alive
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2023 | 7:55 AM

కుటుంబ పెద్దలు తినీ తినక..రూపాయిరూపాయి కూడబెట్టి..నాలుగు రాళ్లు వెనకేస్తే..ఆ నాలుగు రాళ్ల కోసం..కడుపున పుట్టిన కన్నపేగులే గునపాలతో పొడిచి చంపేస్తున్నారు. ఏమైనా అంటే ఆస్తి గొడవలంటారు. ఆస్తి గొడవలు మానవత్వాన్ని మరిపిస్తున్నాయి. అన్నదమ్ములు, తండ్రీ కొడుకులు, భార్యాభర్తలు అనే తేడా లేకుండా విచరక్షణారహితంగా హత్యలకు పాల్పడుతున్నారు. డబ్బుకోసం కన్న తల్లైనా..కన్న తండ్రైనా డోన్ట్‌ కేర్ అంటున్నారు. ఎకరం భూమి అమ్మితే పది లక్షలొచ్చాయి.. ఆ డబ్బు ఇవ్వలేదని.. ఆ కూతుళ్లు తండ్రిపై కక్ష పెంచుకున్నారు. కని పెంచి పెద్దచేసి..పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపినా.. ఇంకా వాళ్లకు ఆశ తీరలేదు. నాన్నకు డబ్బులొచ్చాయని తెలిసిన వెంటనే..కన్న కూతుళ్లు రాబందులయ్యారు. రాక్షసంగా పీక్కు తినడం స్టార్ట్‌ చేశారు. ఆ తండ్రికి 70 ఏళ్లు..కృష్ణారామ అనుకునే వయసు.. మునుపటి మాదిరి నడవలేడు.. అయినా కూతుళ్లు వదల్లేదు.. డబ్బులివ్వలేదని.. తండ్రినే సజీవ దహనం చేశారు ఎంత గొప్ప కూతుళ్లో..అసలు వీళ్లను మించిన కూతుళ్లు ఎవరైనా ఉంటారా చెప్పండి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో జరిగింది.

రాజంపేటకు చెందిన కొప్పుల ఆంజనేయులుకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. లీల, గంగమని, నర్సవ్వ అని ఆంజనేయులుకు ముగ్గురు కూతుళ్లున్నారు. లీల తన కొడుకుతో కలిసి తండ్రి దగ్గరే ఉంటోంది.. మరో కూతురు గంగమని కూడా రాజంపేటలోనే ఉండగా ఇంకో కూతురు నర్సవ్వ వేరే ఊర్లో ఉంటోంది. ఆంజనేయులు అందరి జీవితాలను సెట్‌ చేశాడు. ఎక్కడా ఎవరికీ ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాయి. అయినా కూతుళ్లకు కన్ను కుట్టింది. ఏదో అవసరం నిమిత్తం ఆంజనేయులు ఎకరం భూమి అమ్మేశాడు. పది లక్షలు డబ్బులొచ్చాయి..ఈ డబ్బుల విషయంలో ఇంట్లో ఉప్పెన వచ్చింది.. డబ్బులు పంచాలంటూ ముగ్గురూ ఆ ముసలి తండ్రితో గొడవకు దిగారు. అవి వేరే అవసరం ఉందమ్మా అని ఎంత నచ్చజెప్పినా..కడుపున పుట్టిన కసాయి కూతుళ్లు అస్సలు వినలేదు..డైలీ వీళ్ల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. తండ్రి ఎంత వారించినా.. కూతుళ్లు సర్దుకోవడం లేదు..

నాన్నతో ఎలాగైనా డబ్బులు గుంజాలి. ఊరికే వదలకూడదని ముగ్గురు కూతుళ్లు ఫిక్సయ్యారు. ఖతర్నాక్‌ ప్లాన్‌ వేశారు. తండ్రి బతికుండగా మనకు డబ్బులు రావు.. కాబట్టి.. చంపేస్తే.. ఆ డబ్బులు మన ముగ్గురం పంచుకోవచ్చని మర్డర్‌ స్కెచ్చేశారు. గుడిసెలో ఉంటున్న తండ్రి నిద్రపోతున్న సమయంలోనే ప్లాన్‌ అమలు చేశారు. ముగ్గురు కూతుళ్లతో పాటు, మనవడు భాను ప్రకాష్‌ కూడా..ఆ పెద్దాయన్ను చంపడంలో కీలక పాత్ర పోషించారు. గుడిసెకు నిప్పంటించారు.. మంటలకు కాలిపోయిన ఆంజనేయులు సజీవ దహనం అయ్యాడు.

ఇవి కూడా చదవండి

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. దర్యాప్తు చేస్తున్నారు. ఆంజనేయులు సజీవదహనంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి కూతుళ్లున్నారీ లోకంలో..వీళ్లూ ఆడవాళ్లే..

మరిన్నీ తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..