Janasena: నేడే జనసేన పదో వార్షిక ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు.. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమలు

బందరు శివర్లో 35 ఎకరాల్లో సభ ప్రాంగణం ఏర్పాట్లు చేశారు. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు. కార్యకర్తలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అన్ని వసతులతో సభా ప్రాంగణం సిద్ధం అయ్యింది.

Janasena: నేడే జనసేన పదో వార్షిక ఆవిర్భావ సభ.. భారీ ఏర్పాట్లు.. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమలు
Jansena Varahi
Follow us

|

Updated on: Mar 14, 2023 | 9:12 AM

జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. బందరు నగర శివారులో జరగనున్న ఈ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేశారు జనసేన నేతలు, కార్యకర్తలు. ఈ కార్యక్రమం జరిగే సభా వేదిక వద్దకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి వాహనంలో  చేరుకోనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు.  బందరు శివర్లో 35 ఎకరాల్లో సభ ప్రాంగణం ఏర్పాట్లు చేశారు. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు. కార్యకర్తలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అన్ని వసతులతో సభా ప్రాంగణం సిద్ధం అయ్యింది. సభా స్థలంలో 1,20,000 మంది కూర్చునేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు.  20 ఎకరాల్లో పార్కింగ్ కు ఏర్పాటు చేయగా.. ఎల్ ఈడీ స్క్రీన్స్ తో 10 గ్యాలరీలు ఏర్పాటు చేశారు.  సాయంత్రం 5 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్.

సభకు వచ్చేవారికి మజ్జిగ, మంచినీరు, స్నాక్స్ ఆహారం వైద్య సదుపాయం, మరుగుదొడ్లు కూడా ఏర్పాట్లు చేశారు. అన్ని సౌకర్యాలు అందించే విధంగా 2,000మందితో వాలంటీర్ వ్యవస్థను నియమించినట్లు నిర్వాహకులు తెలిపారు. కిలోమీటర్ పరిధి వరకు జనసేనానాని ప్రసంగాన్ని వీక్షించేలా 14అడుగుల పొడవు 10అడుగుల వెడల్పు కలిగిన LED స్క్రీన్లను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.

2024 ఎన్నికలకు పవన్ సిద్ధపడుతున్న వేళ.. భారీ ర్యాలితో బందర్ రావటానినికి సిద్ధం అవుతున్న జనసేన కర్యకర్తలు, నేతలు. అయితే ర్యాలీపై పోలీసుల ఆంక్షలతో ఉత్కంఠ నెలకొంది. ఎటువంటి ర్యాలీకి అనుమతి లేదంటూ కృష్ణ జిల్లా ఎస్పీ జాషువ ప్రకటించారు. విజయవాడ మచిలీపట్టణం జాతీయ రహదారిపై సభలు ,ప్రదర్శనలలకు అనుమతిని నిరాకరించారు. అంతేకాదు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమలు ఉందని.. ఈ నియమాలను ఉల్లంగించిన వారిపై తీవ్ర చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles