Hyderabad: ఊబిలో చిక్కుకున్న గుర్రం.. రక్షించేందుకు వెళ్లి గుర్రం సహా ఇద్దరు యువకులు మృతి..

నాలాలో నీటిని తాగేందుకు గుర్రం వెళ్ళింది. గుర్రం ఊబిలో చిక్కుకోవడంతో రక్షించేందుకు అశు సింగ్ వెళ్ళాడు. అంతేకాదు సహాయం కోసం కేకలు వేయడంతో కాపాడేందుకు వెళ్లిన హార్స్ రైడింగ్ సెంటర్ ఓనర్ అజమ్ కొడుకు సైఫ్ కూడా వెళ్ళాడు. 

Hyderabad: ఊబిలో చిక్కుకున్న గుర్రం.. రక్షించేందుకు వెళ్లి గుర్రం సహా ఇద్దరు యువకులు మృతి..
Hyderabad
Follow us

|

Updated on: Apr 27, 2023 | 7:06 AM

హార్స్ రైడింగ్‌పై ఉన్న ఇంట్రస్ట్‌తో హైదరాబాద్‌ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు రాజస్థాన్‌కు చెందిన యువకుడు. అతనితో పాటు మరో యువకుడిని కూడా వాగు మింగేసింది. గుర్రాన్ని కాపాడబోయి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ వాగులో చోటుచేసుకుంది.

తెలంగాణ హార్స్ రైడింగ్ పేరుతో అజమ్ అనే వ్యక్తి.. హార్స్ రీడింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నాడు. ఈ హార్స్ రైడింగ్ నేర్చుకునేందుకు అసుసింగ్ రాజస్థాన్ నుంచి వచ్చాడు. రాజస్థాన్‌కు చెందిన అసుసింగ్, కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన సైఫ్ అనే ఇద్దరి యువకులు గుర్రం పై హార్స్‌ రేసింగ్ చేసుకుంటూ కిస్మత్పూర్ వైపు వెళుతుండగా… అక్కడ ఉన్న నాలాలో నీటిని తాగేందుకు గుర్రం వెళ్ళింది.

గుర్రం ఊబిలో చిక్కుకోవడంతో రక్షించేందుకు అశు సింగ్ వెళ్ళాడు. అంతేకాదు సహాయం కోసం కేకలు వేయడంతో కాపాడేందుకు వెళ్లిన హార్స్ రైడింగ్ సెంటర్ ఓనర్ అజమ్ కొడుకు సైఫ్ కూడా వెళ్ళాడు.  అసుసింగ్, సైఫ్ ఇద్దరు యువకులు వాగులోకి దిగారు. మునిగిపోతున్న గుర్రాన్ని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే ఇద్దరికీ ఈత రాకపోవడం వల్ల వాగులో గల్లంతైయ్యారు.

ఇవి కూడా చదవండి

విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. రాజేంద్రనగర్ నాలాలో గుర్రంతో సహా నీటిలో మునిగి చనిపోయిన సైఫ్, ఆసుసింగ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. గుర్రంతో పాటు ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు. పోస్టుమార్టం నిర్వహించారు.

REPORTER: SRAVAN

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles