Stray Dogs: దారుణ సంఘటన.. రోడ్డుపైనే మహిళను పీక్కుతిన్న వీధికుక్కలు

మహిళపై వీధికుక్కులు దాడి చేసి ప్రాణాలు తీశాయి. అనంతరం మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Stray Dogs: దారుణ సంఘటన.. రోడ్డుపైనే మహిళను పీక్కుతిన్న వీధికుక్కలు
Dogs
Follow us

|

Updated on: Apr 30, 2023 | 11:31 AM

మహిళపై వీధికుక్కులు దాడి చేసి ప్రాణాలు తీశాయి. అనంతరం మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లా కన్హివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంద్రాయి గ్రామానికి చెందిన 55 ఏళ్ల మహిళ శనివారం ఉదయం 7 గంటల సమయంలో పొలానికి వెళ్తుండగా ఓ చెట్టు వద్ద వీధి కుక్కల గుంపు చుట్టుముట్టింది. ఆపై వీధి కుక్కలు మూకుమ్మడిగా ఆమెపై దాడి చేశాయి. ఈ దాడిలో మహిళ మృతి చెందింది. అనంతరం వీధి కుక్కలు మహిళ మృతదేహాన్ని పీక్కుతినడం ప్రారంభించాయి. అటుగా వెళ్తున్న కొందరు గమనించి గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించారు. మహిళపై జరిగిన హింసాత్మక దాడి గురించి అటవీ అధికారులకు సైతం సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కుక్కల దాడి కారణంగానే మహిళ మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. కుక్కల దాడి వల్ల మృతురాలి శరీరానికి లోతైన గాయాలు అయినట్లు, ఆ కారణంగానే ఆమె మరణించినట్లు నివేదిక తెల్పింది. మృతదేహంపై ఇతర గాయాలు లేవని కన్హిల్వాడ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ మోనిస్ సింగ్ బైస్ తెలిపారు. సియోనీ సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి యోగేష్ పటేల్ మాట్లాడుతూ.. మహిళ మాంసాన్ని తిన్న తీరు చూస్తుంటే అడవి జంతువుల దాడిగా కనిపించడం లేదని, ఘటనా స్థలానికి 5 కిలోమీటర్ల పరిధిలో అడవి లేదని తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles