Vizag Kidney Racket: వైజాగ్‌ కిడ్నీ రాకెట్‌ కేసులో ఆరుగురు అరెస్ట్.. ఇద్దరు వైద్యులు, ప్రధాన నిందితుడు పరార్‌

వైజాగ్‌లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు దళారులను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. అసలు సూత్రధారితో పాటు సర్జరీ చేసిన ఇద్దరు వైద్యుల కోసం పోలీస్‌ ప్రత్యేక బృందాలు..

Vizag Kidney Racket: వైజాగ్‌ కిడ్నీ రాకెట్‌ కేసులో ఆరుగురు అరెస్ట్.. ఇద్దరు వైద్యులు, ప్రధాన నిందితుడు పరార్‌
Vizag Kidney Racket
Follow us

|

Updated on: May 01, 2023 | 8:13 AM

వైజాగ్‌లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు దళారులను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. అసలు సూత్రధారితో పాటు సర్జరీ చేసిన ఇద్దరు వైద్యుల కోసం పోలీస్‌ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు విశాఖ పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమ్‌ వర్మ ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..

ఇదీ అసలు కథ..

మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి వినయ్‌ కుమార్‌ ఒక సప్లయిస్‌ షాప్‌లో వెహికల్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ శ్రీను అనే వ్యక్తికి ప్రమాదం జరిగితే వినయ్‌ కుమార్‌ పరామర్శించడానికి వెళ్లాడు. అక్కడ అతడికి కామరాజు, ఎలీనా అనే వ్యక్తులను శ్రీను, అతడి భార్య కొండమ్మ పరిచయం చేశారు. మాటల సందర్భంలో కిడ్నీ ఇస్తే రూ.8.50 లక్షలు ఇస్తామని వారు వినయ్‌కుమార్‌కు డబ్బు ఆశ చూపారు. డబ్బుకు ఆశపడి వినయ్‌కుమార్‌ కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించాడు. దీంతో అతడిని ఓ ల్యాబ్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఈ విషయం వినయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు తెలియడంతో కిడ్నీ దానానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత అతను హైదరాబాద్‌లో తన మేనత్త ఇంటికి వెళ్లిపోయాడు.

ఈ నేపథ్యంలో కామరాజు ఫోన్‌ చేసి కిడ్నీ ఇవ్వకపోతే వైద్య పరీక్షలకు అయిన ఖర్చు రూ.60 వేలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఇంటికి వస్తామని వినయ్‌ కుమార్‌ను బెదిరించాడు. దీంతో అతడు కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించాడు. హైదరాబాద్‌ నుంచి వినయ్‌కుమార్ విశాఖ రాగానే పెందుర్తిలో ఉన్న తిరుమల ఆస్పత్రి వైద్యుడు పరమేశ్వరరావును కలిసి మరో ఇద్దరు వైద్యుల సహాయంతో గత డిసెంబర్‌లో కిడ్నీ తొలగించారు. ఆ సమయంలో ఆసుపత్రిలోని సీసీ కెమెరాలను ఆఫ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

అనంతరం ఒప్పందం ప్రకారం రూ.8.5 లక్షలు ఇవ్వకపోగా రూ.5 లక్షలు ఇస్తున్నట్లు వీడియో రికార్డింగ్‌ చేశారు. ఆ నగదులో రూ.2.5 లక్షలు మాత్రమే వినయ్‌కు ఇచ్చారు. మూడు నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో కామరాజు గ్యాంగ్‌పై వినయ్‌కుమార్‌ పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.

పరారీలో ప్రధాన సూత్రదారి..

ఈ కేసులో ప్రధాన సూత్రదారి కడపకు చెందిన నార్ల వెంకటేష్‌. 2019లో కిడ్నీ రాకెట్‌ వ్యవహారం అతడు అప్పట్లో జైలు పాలయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా తీరు మార్చుకోని వెంకటేష్‌కు ఎలీనా, కామరాజు గ్యాంగ్‌తో పరిచయం ఉండడంతో వారి ద్వారా వినయ్‌కుమార్‌కు డబ్బు ఎరవేశాడు. ఈ కేసులో ఎలీనా, ఎం.కామరాజు, ఎం.శ్రీను, కొండమ్మ, శేఖర్‌, డాక్టర్‌ పరమేశ్వరరావులను అరెస్టు చేశారు. ఆపరేషన్‌ చేసిన వైద్యులు, ప్రధాన నిందితుడు వెంకటేశ్వరరావు పరారీలో ఉన్నారని పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమ్‌ వర్మ తేల్చిచెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles