Minister video call Leak: మహిళతో రాష్ట్ర మంత్రి రాసలీలలు.. వీడియో లీక్..!
ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా వివాదంలో చిక్కుకున్నారు. వీడియో కాల్ ఆయన మంత్రి పదవికి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. ఓ మహిళతో చాట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌తో దుమారం రేపుతోంది. ఈ మంత్రి నిర్వాకంపై దర్యాప్తు జరపాలని..
జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా వివాదంలో చిక్కుకున్నారు. వీడియో కాల్ ఆయన మంత్రి పదవికి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. ఓ మహిళతో చాట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌తో దుమారం రేపుతోంది. ఈ మంత్రి నిర్వాకంపై దర్యాప్తు జరపాలని, ఆయన రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జార్ఖండ్ మంత్రి ఒకరు ఓ మహిళతో వీడియో కాల్ ద్వారా అసభ్య సంభాషణ జరిపినట్లుగా వెలుగు చూడటం సంచలనం రేపింది. ఈ కాగా ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాంగ్రెస్ నేత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా ఫోన్ లో ఓ మహిళతో మాట్లాడారు. వారిద్దరి మధ్య అసభ్య సంభాషణ జరిగినట్లుగా నెట్టింట చక్కర్లు కొడుతోందీ వీడియో. ఈ వీడియోను బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కాంగ్రెస్ స్వభావం ఇదేనని, ఇది జార్ఖండ్ మంత్రి తీరు అని, మహిళల ఆత్మగౌరవంతో ఆడుకుంటున్నందుకు కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇందుకు సంబంధించి దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది నిజమైతే మంత్రి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాగా ఈ వీడియోపై మంత్రి బన్నా వివరణ ఇచ్చారు. తనను అపఖ్యాతి పాల్జేసే కుట్రలో భాగంగా ఇది వచ్చిందన్నారు. ఇది ఎడిట్ చేసిన వీడియో అని అర్థమవుతోందని, తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ వీడియోపై పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!