AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరరూప రాక్షసి..! మృతదేహాల అవయవాలు దొంగిలించి.. ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టి..

అమెరికాలోని అర్కాన్సాస్ యూనివర్సిటీ అనాటమీ ల్యాబ్‌కు విరాళంగా వచ్చిన శవాల శరీర భాగాలను ఓ మహిళ దొంగిలించింది. అనంతరం ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టి దాదాపు రూ.9 కోట్లు ఆర్జించింది. ఇలా మొత్తం 20 బాక్సుల అవయవాలను విక్రయించినట్లు..

నరరూప రాక్షసి..! మృతదేహాల అవయవాలు దొంగిలించి.. ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టి..
Human Organs Selling
Srilakshmi C
|

Updated on: May 02, 2023 | 8:29 AM

Share

అమెరికాలోని అర్కాన్సాస్ యూనివర్సిటీ అనాటమీ ల్యాబ్‌కు విరాళంగా వచ్చిన శవాల శరీర భాగాలను ఓ మహిళ దొంగిలించింది. అనంతరం ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టి దాదాపు రూ.9 కోట్లు ఆర్జించింది. ఇలా మొత్తం 20 బాక్సుల అవయవాలను విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వివరాల్లోకెళ్తే..

కెన్‌డేస్‌ చాంప్‌మన్‌ స్కాట్‌ (36) అనే మహిళ అర్కాన్సాస్ యూనివర్సిటీ అనాటమీ ల్యాబ్‌లో పని చేస్తోంది. మృతదేహాలను రవాణా చేయడం, వాటిని పూడ్చిపెట్టడం, అవసరమైతే వాటికి కొన్ని లేపనాలు పూసి భద్రపరచడం ఆమె పని. పనిలో లొసుగులు తెలుసుకున్న స్కాట్‌కు దుర్బుద్ధి పుట్టింది. ఈ క్రమంలోనే పెన్సిల్వేనియాకు చెందిన జెరెమీ లీ పాలీ (40) అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుంది. తొలుత 2021 అక్టోబర్ లో గుండె, రెండు మానవ మెదడులను 1200ల డాలర్లకు అతనికి విక్రయించింది. ఆ తర్వాత 9 నెలల కాలంలో మృతుల చర్మం, పుర్రె, గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కాలేయాలు, మూత్రపిండాలు, కళ్లు.. ఇలా 20 అవయవాల బాక్సులను ఆన్‌లైన్‌ ద్వారా అతనికి అమ్మేసింది. బదులుగా అతను 16 వేర్వేరు బదిలీల ద్వారా 10,975 డాలర్లను చెల్లించాడు.

‘డిటీస్’ పేరుతో సదరు మహిళ (స్కాట్‌) తొలుత ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసింది. షాపింగ్ చేయడానికి సురక్షితమైన మార్గం అనే ప్రకటనతో తన వ్యాపారం ప్రారంభించింది. దాదాపు 380 మంది ఆమె ఫేస్‌బుక్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై 2022 జూన్‌లో పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన ఎఫ్‌బీఐ అధికారులు జెరెమీ లీ పాలీని గతేడాది జులైలో అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ఈ అవయవాలను ఎందుకు కొనుగోలు చేశాడన్నదానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని ఇంట్లో సోదా చేయగా బకెట్లలో నిల్వ చేసిన మానన చర్మం, ఇతర అవయావాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అవయవాలన్నీ తనకు ఫ్రాన్స్‌ నుంచి వస్తున్నట్లు పాలీ అధికారులకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఏప్రిల్‌ 5న స్కాట్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అవయవాల విక్రయం, ఆన్‌లైన్‌ మోసం, అంతర్‌రాష్ట్ర అక్రమ రవాణా తదితర 12 సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. తాజాగా దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేసు వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి (మే 2) వాయిదా వేశారు. ఈ రోజు జరగనున్న బెయిల్‌ విచారణలో ఆమెకు బెయిల్‌ ఇవ్వాలా? వద్దా అనే అంశంపై స్పష్టత రానుంది. ఈ కేసుపై విచారణ మే 30న ప్రారంభం కానుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.