PAN: మీకు తెలియకుండా మీ పేరుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా? ఇలా చెక్ చేసుకోండి!
డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండటంతో, పాన్ కార్డ్ దుర్వినియోగం, అనధికార రుణాల కేసులు అధికమవుతున్నాయి. మీ పాన్‌పై తెలియని లోన్ ఉందో లేదో తెలుసుకోవడానికి క్రెడిట్ రిపోర్ట్, బ్యాంక్ SMS/ఈమెయిల్‌లు, AISలను తనిఖీ చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద రుణాలు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు, క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేయడం ద్వారా ఆర్థిక నష్టాలను నివారించవచ్చు.

డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో పాన్ కార్డ్ (PAN) దుర్వినియోగం కేసులు కూడా పెరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తులు ఇతరుల పాన్ వివరాలతో అనుమతి లేకుండా రుణాలు తీసుకునే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొన్ని సులభమైన చర్యల ద్వారా మీ పేరుపై ఎవరో లోన్ తీసుకున్నారా లేదా తెలుసుకోవచ్చు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేయండి
మీ పాన్‌కు లింక్ అయిన అన్ని రుణాల వివరాలు క్రెడిట్ బ్యూరోలలో నమోదై ఉంటాయి. CIBIL, Experian, Equifax, CRIF High Mark వంటి సంస్థల వెబ్‌సైట్లలో మీ క్రెడిట్ రిపోర్ట్‌ను ఉచితంగా లేదా తక్కువ ఫీజుతో పొందవచ్చు. అందులో తెలియని లోన్ కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
బ్యాంక్ SMSలు, ఈమెయిల్స్ పరిశీలించండి
మీకు తెలియని లోన్ EMI సందేశాలు లేదా బ్యాంక్ నుంచి వచ్చిన ఈమెయిల్స్ ఉంటే అవి హెచ్చరికగా పరిగణించాలి. చాలాసార్లు బాధితులు ఇలా మొదట గుర్తిస్తారు.
ఆదాయపు పన్ను ఖాతా (AIS) చూడండి
ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లోని Annual Information Statement (AIS) లో కూడా కొన్ని రుణ సంబంధిత ఎంట్రీలు కనిపించవచ్చు. అక్కడ అనుమానాస్పద సమాచారం ఉందో లేదో పరిశీలించాలి.
సందేహం ఉంటే వెంటనే చర్యలు తీసుకోండి
తెలియని లోన్ కనిపిస్తే సంబంధిత బ్యాంక్ లేదా NBFC కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అలాగే క్రెడిట్ బ్యూరోకు డిస్ప్యూట్ రైజ్ చేయాలి. అవసరమైతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం మంచిది. సమయానికి తనిఖీ చేస్తూ జాగ్రత్తలు పాటిస్తే పాన్ దుర్వినియోగం వల్ల వచ్చే ఆర్థిక నష్టాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
