India Semifinal Scenario: అనుకున్నదే జరిగిందిగా.. జింబాబ్వే భారీ ఓటమితో.. సెమీస్ నుంచి భారత్ ఔట్?
India semifinal chances Super 8: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8లో భాగంగా ముంబైలోని వాంకిడే స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు జింబాబ్వేపై 107 పరుగుల భారీ తేడాతో ఆకట్టుకునే విజయం సాధించింది. ఈ విజయంతో వెస్టిండీస్ సెమీఫైనల్ బెర్తు కోసం తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా, ఇది టీమిండియా సెమీస్ అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేసింది.

India qualification scenarios Super 8: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు జింబాబ్వేపై 107 పరుగుల భారీ తేడాతో గెలిచింది. దీంతో భారత్ సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు మరింత కఠినంగా మారాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో వెనుకబడ్డ భారత్‌కు, వెస్టిండీస్ సాధించిన భారీ విజయంతో నెట్ రన్ రేట్ (NRR) పరంగా పెద్ద దెబ్బ తగిలింది. ఇకపై భారత్ మిగిలిన మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక విండీస్, జింబాబ్వే మ్యాచ్ గురించి మాట్లాడితే.. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 254/6 భారీ స్కోరు సాధించింది. షిమ్రాన్ హెట్‌మైయర్ 34 బంతుల్లో 85 పరుగులు చేసి దుమ్మురేపాడు. రోవ్‌మన్ పౌవెల్ కూడా హాఫ్ సెంచరీతో జట్టుకు బలం చేకూర్చాడు. ప్రత్యుత్తరంగా జింబాబ్వే బ్యాటింగ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ లక్ష్యానికి చాలా దూరంగా నిలిచింది. గుడాకేశ్ మోటి 4 వికెట్లు తీసి జింబాబ్వే ఇన్నింగ్స్‌ను కూల్చేశాడు.
భారత్ తదుపరి మ్యాచ్ జింబాబ్వేతో చెన్నైలో బుధవారం ఆడనుంది. అదే రోజు గ్రూప్–1లోని మరో సూపర్–8 మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ తలపడతాయి. ఈ మ్యాచ్ ఫలితంపై భారత్ సెమీఫైనల్ భవితవ్యం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్‌కు మార్గం కొంత సులభం అవుతుంది.
భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించే గణాంకాలు..
1: భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిస్తే..
వెస్టిండీస్, జింబాబ్వేపై భారత్ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే, మూడు మ్యాచ్‌ల నుంచి భారత్‌కు 4 పాయింట్లు వస్తాయి. దక్షిణాఫ్రికా తన సూపర్–8 మ్యాచ్‌లన్నింటిని గెలిస్తే, దక్షిణాఫ్రికాతో పాటు భారత్ సెమీఫైనల్‌కు చేరుతుంది.
అయితే, దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌పై ఓడితే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, భారత్ మూడు జట్లకు 4 పాయింట్లు వస్తాయి. అప్పుడు సెమీఫైనల్ బెర్త్ నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. దక్షిణాఫ్రికా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడితే భారత్, వెస్టిండీస్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
2: భారత్ రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే గెలిస్తే..
భారత్ తప్పనిసరిగా వెస్టిండీస్‌పై గెలవాలి. దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్‌లన్నింటినీ గెలిచి, భారత్ వెస్టిండీస్‌పై గెలిచి జింబాబ్వేపై ఓడితే, భారత్, జింబాబ్వే,వెస్టిండీస్ మూడు జట్లకు 2 పాయింట్లు వస్తాయి. అప్పుడు కూడా నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. కానీ దక్షిణాఫ్రికా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడితే, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ సెమీఫైనల్‌కు చేరలేదు.
గ్రూప్–1 మిగిలిన సూపర్–8 మ్యాచ్‌లు..
ఫిబ్రవరి 26: దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ (అహ్మదాబాద్)
ఫిబ్రవరి 26: భారత్ vs జింబాబ్వే (చెన్నై)
మార్చి 1: దక్షిణాఫ్రికా vs జింబాబ్వే (దిల్లీ)
మార్చి 1: భారత్ vs వెస్టిండీస్ (కోల్‌కతా).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
