కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన మహిళ.. స్కానింగ్‌ రిపోర్ట్ చూసి షాకైన డాక్టర్స్.. అసలేం జరిగిందంటే..

నలుగురు పిల్లలు పుట్టిన తరువాత,గర్భాశయాన్ని తొలగించడానికి ఆపరేషన్‌ జరిగిందని, అయితే, ఆ తర్వాత కడుపునొప్పి మొదలైందని చెప్పింది. మొదట్లో సమీపంలోని వైద్యులు నొప్పి నివారణ మాత్రలు ఇచ్చారు. అయితే అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కొన్నిసార్లు తనకు రాత్రిపూట నిద్రపోలేనంత తీవ్రమైన కడుపునొప్పి వస్తుందని మారియా చెప్పింది.

కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన మహిళ.. స్కానింగ్‌ రిపోర్ట్ చూసి షాకైన డాక్టర్స్.. అసలేం జరిగిందంటే..
Needlenthread
Follow us
Jyothi Gadda

|

Updated on: May 02, 2023 | 5:24 PM

ఓ యువతి గత 11 ఏళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పి వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్స్ వాడుతూనే ఉంటుంది. కానీ, ఒకసారి కడుపు నొప్పి భరించలేనంతగా మారింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. డాక్టర్లు ఆమెకు వెంటనే ఎంఆర్‌ఐ స్కాన్‌ చేశారు. ఆ తర్వాత వచ్చిన పరీక్ష ఫలితాలు చూసి ఆ మహిళ, కుటుంబ సభ్యులు, డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళ కడుపులో లోపల సూది, దారం కనిపించటంతో అందరూ కంగుతిన్నారు. సూది, దారం వల్లే మహిళ తరచూ కడుపు నొప్పితో అవస్థపడేదని వైద్యులు నిర్దారించారు. అనంతరం ఆమెకు ఆపరేషన్ చేసి పొట్టలో ఉండిపోయిన సూది దారాన్ని బయటకు తీశారు. ఈ ఘటన కొలంబియాలో చోటుచేసుకుంది. బాధిత మహిళ 39 ఏళ్ల మరియా అడెర్లిండా ఫోరియో కడుపులో సూది, దారం గుర్తించారు.

మొదట కడుపునొప్పి మామూలే అనుకున్నా.. నొప్పి భరించలేనంతగా వేధించటంతో వైద్యుల వద్దకు వెళ్లానని.. ఎంఆర్‌ఐ ఫలితాలు పరిశీలించగా కడుపులో సూది, దారం పడి ఉన్నట్లు తేలిందని మరియా తెలిపింది. 4 పిల్లలు పుట్టిన తరువాత,గర్భాశయాన్ని తొలగించడానికి ఆపరేషన్‌ జరిగిందని, అయితే, ఆ తర్వాత కడుపునొప్పి మొదలైందని చెప్పింది. మొదట్లో సమీపంలోని వైద్యులు నొప్పి నివారణ మాత్రలు ఇచ్చారు. అయితే అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కొన్నిసార్లు తనకు రాత్రిపూట నిద్రపోలేనంత తీవ్రమైన కడుపునొప్పి వస్తుందని మారియా చెప్పింది. సుమారు 11 ఏళ్లపాటు నొప్పితో పోరాడారు. చివరకు వారు అసలు కారణాన్ని కనుగొనడానికి అల్ట్రాసౌండ్, MRI చేశారు.

ఇవి కూడా చదవండి
Needlenthread 1

ఫెలోపియన్ ట్యూబ్‌కు ఆపరేషన్ చేసినప్పుడు వైద్యులు చేసిన పొరపాటు ఇది. సూది, దారం ప్రమాదవశాత్తూ కడుపులోనే వదిలేశారు. ప్రస్తుతం జరిగిన సర్జరీ అనంతరం వైద్యులు నొప్పికి కారణమైన సూది దారం తొలగించడంతో మారియా ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టుగా చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..