హైవే పక్కన దాహం తీర్చుకుంటున్న పెద్దపులి..భారీగా నిలిచిపోయిన వాహనాలు.. వీడియో చూస్తేనే హడల్..!
కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు ఈ వీడియో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బహుశా పులులకు వాటి పరిసరాల్లో నీటి ఎద్దడి ఎక్కువ ఉండి ఉండొచ్చునని, అందుకే ఇలా హైవేల వెంట అడవిలోంచి బయటకొచ్చినట్టుగా భావిస్తున్నారు. "ఎంత అందమైన దృశ్యం" అని మరొక వినియోగదారు పోస్ట్ చేసారు.
సోషల్ మీడియా లేకుండా ఉండలేని వాతావరణంలో మనం జీవిస్తున్నాం..చాలా మందికి సోషల్ మీడియా పేజీలు పని చేయనప్పుడు వీడియోలు చూడటం అలవాటు..అందుకే మనం సోషల్ మీడియా ప్రపంచంలో చాలా విషయాలు చూస్తుంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని ఊహించలేం కూడా..జంతువుల వీడియోలు, పిల్లలు చేసే కొంటెపనులకు సంబంధించిన వీడియోలు ఇలా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అనేక రకలైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మనం చూసే వీడియోలు కొన్నిసార్లు మనల్ని నవ్విస్తాయి. కొన్నిసార్లు మనల్ని ఆలోచింపజేస్తాయి.. మరికొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.. కొన్ని వీడియోలు మనల్ని షాక్ అయ్యేలా చేస్తాయి. కొన్ని వీడియోలు మనల్ని బాధపెడతాయి కూడా. తాజాగా ఒక పెద్ద పులి హైవే పక్కన నీళ్లు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కతర్నియాగట్ వన్యప్రాణుల అభయారణ్యం గుండా వెళుతున్న జాతీయ రహదారి పక్కన ఫారెస్ట్ బెంగాల్ టైగర్ నీళ్లు తాగుతున్న వీడియోను షేర్ చేశారు. వీడియోలో పులి దాహం తీర్చుకోవడం చూసిన వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోయారు. ఏ మాత్రం పులిని కదిలించిన ఎక్కడ దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎక్కడివారక్కడే నిశబ్ధంగా నిలబడిపోయారు. అయితే, కొందరు మాత్రం బైకులు, కార్లు దిగి రోడ్డుపై నిలబడి ఉన్నట్టుగా కూడా వీడియోలో కనిపించింది. రోడ్డుపై బారులు తీరిన వాహనాలు కూడా మనం వీడియోలో చూడొచ్చు.
The road stopper !! From Katarniaghat WLS. @aakashbadhawan pic.twitter.com/etxOeJLF5B
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 1, 2023
ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి ఆకాష్ దీప్ బదవాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కొన్ని గంటల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో ట్విటర్‌లో 60,000 పైగా వ్యూస్‌ను సాధించింది. కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు ఈ వీడియో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బహుశా పులులకు వాటి పరిసరాల్లో నీటి ఎద్దడి ఎక్కువ ఉండి ఉండొచ్చునని, అందుకే ఇలా హైవేల వెంట అడవిలోంచి బయటకొచ్చినట్టుగా భావిస్తున్నారు. “ఎంత అందమైన దృశ్యం” అని మరొక వినియోగదారు పోస్ట్ చేసారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..