Tea: టీతో పాటు ఈ స్నాక్స్ తింటే విషపూరితం కావచ్చు.. బీ కేర్ ఫుల్
అయితే టీతో పాటు, లేదంటే టీ తాగిన వెంటనే కొన్ని పదార్థాలను పొరపాటున కూడా తినకూడదు. అలా తీసుకుంటే శరీరానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఒక్కోసారి అవి విషపూరితం కూడా కావచ్చని మీకు తెలుసా? వాటిని కనుక మీరు తిన్నారంటే ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.
Updated on: May 01, 2023 | 9:18 PM

టీ తాగడం వల్ల అలసిన శరీరానికి ఉత్సాహం వస్తుంది. అలాంటి టీని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా తాగుతుంటారు. అయితే, కొన్ని పదార్థాలతో కలిసి టీ తాగకూడదని మీకు తెలుసా..? అలా చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే టీతో తినకూడని పదార్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Lemon- నిమ్మరసం: కొందరు నిమ్మరసాన్ని టీలో కలిపి తాగుతారు. దీన్ని తాగితే బరువు తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ టీలో నిమ్మరసం కలిపి తీసుకుంటే, టీ ఆమ్లంగా మారుతుంది.


Curd- పెరుగు: పెరుగును టీతో కలిపి తినకూడదు. పెరుగుతో చేసిన ఏదైనా టీతో పాటు తినకూడదు.

Ice Cream- ఐస్ క్రీం: వేడి టీ తాగుతూ చల్లని ఆహారం తినకూడదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. వికారం, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. టీ తాగిన తర్వాత కనీసం అరగంట వరకు చల్లని ఆహారం తినకూడదు.





























