AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. వీళ్లేం దొంగలు రా నాయన.. రన్నింగ్ ట్రక్కులోంచి మేకలు చోరీ.. ఎలా కొట్టేస్తున్నారో చూడండి..

ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. చాలామంది దీనిని మూగ జంతువుల పట్ల క్రూరత్వ చర్యగా అభివర్ణించారు. ఇక్కడి జాతీయ రహదారి మధ్య మేకలు దోచుకున్నారని, మూగ జంతువులను ఎందుకు ఇలా హింసించారంటూ ఓ నెటిజన్ రాశారు. మొత్తానికి వీడియో చూసిన ప్రతిఒక్కరూ స్పందించారు. దొంగలు చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తున్నారు.

వామ్మో.. వీళ్లేం దొంగలు రా నాయన.. రన్నింగ్ ట్రక్కులోంచి మేకలు చోరీ.. ఎలా కొట్టేస్తున్నారో చూడండి..
Thieves Stole Goats
Jyothi Gadda
|

Updated on: May 01, 2023 | 7:37 PM

Share

ఇప్పటి వరకు చాలా రకాల దొంగతనం కేసులను చూశాం.. కానీ ప్రస్తుతం మేకల దొంగతనానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. అవును, ఎందుకంటే వైరల్ వీడియోలో ఒక దొంగ మేకలను వేగంగా వెళ్తున ట్రక్కులోంచి చోరీ చేస్తున్న దృశ్యం నెట్టిజన్లను షాక్‌కు గురిచేస్తుంది. అతడు ట్రక్కులోంచి మేకలను నేరుగా హైవేపైకి విసిరేయడం కనిపిస్తుంది. ఈ వైరల్ వీడియో కాన్పూర్-లక్నో హైవేపై జరిగినట్టుగా తెలిసింది. మేకలను దొంగిలించిన దొంగల పనిని చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.

వైరల్ వీడియోలో ఒక ట్రక్కు హైవేపై వేగంగా వెళుతుంది. ఈ సమయంలో ఓ వ్యక్తి కూడా లారీపై నిలబడి కనిపించాడు. ఈ వ్యక్తి ట్రక్కులో ఉన్న మేకలను ట్రక్కు నుండి నేరుగా హైవేపైకి విసిరేస్తున్నాడు. అతని ముఠాలోని ఇతర సభ్యులు ట్రక్కు వెనుక కారును తీసుకెళ్తున్నారు. ట్రక్కులోని మేకలను హైవేపై విసిరిన తర్వాత యువకుడు ట్రక్కు నుండి క్రిందికి దిగడం కూడా వీడియోలో ఉంది.

ఇవి కూడా చదవండి

ట్రక్కులో ఉన్న మేకలను కింద పడేసిన దొంగ వీడియోను కారు డ్రైవర్ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో @vishnutiwariKNP అనే ఖాతా ద్వారా షేర్‌ చేశారు.. వీడియోను పోస్ట్ చేస్తూ, “ఇది ఏ సినిమాలోని సన్నివేశం కాదు, కాన్పూర్-లక్నో హైవేపై కదులుతున్న ట్రక్కు నుండి మేకలు దొంగిలించబడుతున్నాయి” అని క్యాప్షన్ ఉంది.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. చాలామంది దీనిని మూగ జంతువుల పట్ల క్రూరత్వ చర్యగా అభివర్ణించారు. లక్నో-కాన్పూర్ జాతీయ రహదారి మధ్య మేకలు దోచుకున్నారని, మూగ జంతువులను ఎందుకు ఇలా హింసించారంటూ ఓ నెటిజన్ రాశారు. మొత్తానికి వీడియో చూసిన ప్రతిఒక్కరూ స్పందించారు. దొంగల చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
AI ఆటోమేషన్‌.. జూనియర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ కోత!
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
ఉద్యోగ ఇంటర్వ్యూలో డీప్‌ఫేక్‌ మోసం? లైవ్ ఫేస్ ఫిల్టర్‌తో బురిడీ..
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
మరో 4 రోజుల్లో కివీస్‌తో సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే