దారుణం.. తల్లిదండ్రులు అప్పు తీర్చలేదని.. 11 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 40 ఏళ్ల వ్యక్తి!

కాగా, ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా పెను సంచలనం సృష్టించింది. ఆ వ్యక్తి ప్రవర్తన దిగ్భ్రాంతి కలిగించిందని ట్విట్టర్‌లో పలువురు పేర్కొన్నారు. మరో వినియోగదారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఇది కేవలం కిడ్నాప్ కేసు లేదంటే, బాల్య వివాహం లేదా పోక్సో కాదని, మనుషులను కొనుగోలు చేయటం వంటిదని మండిపడ్డారు. ప్రాథమికంగా ఇది మానవ అక్రమ రవాణా అవుతుందని ఆరోపించారు.

దారుణం.. తల్లిదండ్రులు అప్పు తీర్చలేదని.. 11 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 40 ఏళ్ల వ్యక్తి!
Under Pocso Act
Follow us

|

Updated on: May 01, 2023 | 5:11 PM

బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి కట్టలేదని ఓ కుటుంబంలోని 11 ఏళ్ల బాలికను 40ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. బాలికను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిన ఆ వ్యక్తి అప్పటికే పెళ్లైన వాడు.. కానీ, బాలికను రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను మూడు నెలల పాటు తన వద్దే నిర్బంధించాడు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్‌లోని సివాన్‌లో ఏప్రిల్ 30న 11 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న మహేంద్ర పాండే అనే 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

బీహార్‌లోని సివాన్ జిల్లాకు చెందిన లక్ష్మీపూర్ గ్రామంలో ఓ కుటుంబం మహేంద్ర పాండే అనే 40 ఏళ్ల వ్యక్తి దగ్గర రూ.2 లక్షలు అప్పుగా తీసుకుంది. కానీ, కుటుంబ కారణాల వల్ల ఆ బాకీని తిరిగి అతడికి చెల్లించలేకపోయింది. దీనిని అతడు ఆసరాగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించని క్రమంలో కుటుంబంలోని మైనర్ బాలికను తన ఇంటికి పంపించాలని వారిని బెదిరించాడు.. బాలికను తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని బాధిత బాలిక తల్లి ఆరోపించింది. తల్లి ఫిర్యాదు మేరకు మైర్వా పోలీసులు పాండేను అరెస్టు చేసినట్లు సివాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేష్ కుమార్ సిన్హా తెలిపారు. పోలీసుల విచారణలో మహేంద్ర పాండే తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిపై బాల్య వివాహ చట్టం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనకు 14 రోజుల రిమాండ్ కు తరలించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పారు.

కాగా, ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా పెను సంచలనం సృష్టించింది. ఆ వ్యక్తి ప్రవర్తన దిగ్భ్రాంతి కలిగించిందని ట్విట్టర్‌లో పలువురు పేర్కొన్నారు. మరో వినియోగదారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఇది కేవలం కిడ్నాప్ కేసు లేదంటే, బాల్య వివాహం లేదా పోక్సో కాదని, మనుషులను కొనుగోలు చేయటం వంటిదని మండిపడ్డారు. ప్రాథమికంగా ఇది మానవ అక్రమ రవాణా అవుతుందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..